Breaking News

అన్నం పరబ్రహ్మ స్వరూపం

నిజామాబాద్‌, ఫిబ్రవరి 14

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అన్నం పరబ్రహ్మ స్వరూపమని, అన్ని దానాల్లో కెల్లా అన్నదానం గొప్పదని నిజామాబాద్‌ నగర మేయర్‌ దండు నీతూ కిరణ్‌ అన్నారు. శుక్రవారం స్థానిక న్యూ అంబేడ్కర్‌ భవన్‌లో నిర్వహించిన నిజామాబాద్‌ ఫుడ్‌ బ్యాంక్ నాల్గ‌వ‌ వార్షికోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.

ముందుగా జ్యోతి ప్రజ్వన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కామారెడ్డికి చెందిన రెడ్డిశెట్టి చంద్రం సహకారంతో కొనుగోలు చేసిన భోజన సరఫరా వాహనాన్ని మేయర్‌ ప్రారంభించారు. అనంతరం కార్యక్రమానికి విచ్చేసిన వక్తలు మాట్లాడుతూ గత నాలుగు సంవత్సరాలుగా ఫుడ్‌ బ్యాంక్‌ చేస్తున్న అన్నదాన సేవా కార్యక్రమాన్ని ప్రశంసించారు. చిన్న చిన్న పనులే గొప్పగా ఘనత వహిస్తాయని అన్నారు.

ఇకనుంచి 365 రోజుల‌ పాటు ఫుడ్‌బ్యాంక్‌ ద్వారా అన్నదానంతో అన్నార్తుల‌ ఆకలి తీర్చడం జరుగుతుందని సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎస్‌ఎస్‌ఆర్‌ విద్యాసంస్థల అధినేత మారయ్యగౌడ్‌, కేర్‌ డిగ్రీ కళాశాల‌ డైరెక్టర్‌ నరాల‌ సుధాకర్‌, రెడ్‌ క్రాస్‌ సొసైటీ సభ్యులు తోట రాజశేఖర్‌, ప్రముఖ వ్యాపార వేత్త భూమారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Check Also

నిర్లక్ష్యం వద్దు, జాగ్రత్త వహించాలి

నిజామాబాద్‌, ఆగష్టు 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కోవిడ్‌ అనేది కరోనా వైరస్‌ ద్వారా వ్యాపించే సాధారణమైన ...

Comment on the article