Breaking News

సైనికుల త్యాగాలు వెల‌కట్టలేనివి

కామారెడ్డి, ఫిబ్రవరి 14

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ జన సమితి విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో కామారెడ్డి పట్టణంలోని ఎస్‌ఆర్‌కే డిగ్రీ, పీజీ కళాశాల‌లో పుల్వామా దాడిలో మరణించిన సైనికుల‌ సంస్మరణ సభ నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన రిటైర్డ్‌ ఆర్మీ జూనియర్‌ కమిషన్డ్‌ అధికారి మహమ్మద్‌ బాషా షేక్‌ మాట్లాడుతూ గత 20 సంవత్సరాలు భారత సైన్యంలో వివిధ హోదాలో పని చేయడం జరిగిందని, భారత సైన్యంలో పనిచేసే అవకాశం ల‌భించడం అదృష్టంగా భావించాల‌ని పేర్కొన్నారు.

దేశం కోసం రాత్రింబవళ్లు పనిచేసే సైనికుల‌ త్యాగాలు వెల‌కట్టలేనివని, సైనికుల‌ స్ఫూర్తితో నేటితరం ముందుకు వెళ్లాల‌న్నారు. పుల్వామా దాడిలో మరణించిన సైనికుల‌కు నివాళులు అర్పించారు. వారి త్యాగాల‌ను దేశం ఎప్పటికీ మరువదని అన్నారు. నేటి యువత దేశభక్తి భావనను పెంపొందించుకొని ల‌క్ష్యాన్ని నిర్దేశించుకొని అనుకున్న దానిని సాధించడానికి సిద్ధపడాల‌న్నారు.

కార్యక్రమంలో టీఎన్‌ఎస్‌ఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి బాలు, విద్యార్థి జన సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు కుంభాల ల‌క్ష్మణ్‌ యాదవ్‌, అర్‌కే విద్యాసంస్థ కరస్పాండెంట్‌ జైపాల్‌ రెడ్డి, ప్రిన్సిపాల్‌ గురువెందేర్‌ రెడ్డి, కోఆర్డినేటర్‌ దత్తాత్రి, టిఎన్‌ఎస్‌ఎఫ్‌ నాయకులు అంజల్‌ రెడ్డి, శ్రీకాంత్‌ తదితరులు పాల్గొన్నారు.

Check Also

ఘనంగా కెసిఆర్‌ జన్మదిన వేడుకలు

నిజామాబాద్‌, ఫిబ్రవరి 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్రశేఖర్‌ రావు జన్మదిన ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *