Breaking News

సమస్యల‌ పరిష్కారానికి కృషి చేస్తా

నిజామాబాద్‌, ఫిబ్రవరి 14

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అందరినీ కలుపుకు పోయి డివిజన్‌ పరిధిలో అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని నిజామాబాద్‌ మున్సిపల్‌ కార్పోరేషన్‌ 3వ డివిజన్‌ నుండి టీఆర్‌ఎస్‌ కార్పొరేటర్‌గా గెలుపొందిన చిటికె శ్రీనివాస్‌ రెడ్డి హామీ ఇచ్చారు. డివిజన్‌ పరిధిలోని గంగస్థాన్‌ ఫేస్‌ టూ లోని ప్రొద్దుటూరి ల్యాండ్‌ మార్క్‌ అపార్ట్‌మెంట్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో శ్రీనివాస్‌ రెడ్డికి గురువారం రాత్రి అభినందన సభ ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా శ్రీనివాస్‌ రెడ్డి మాట్లాడుతూ డివిజన్‌ పరిధిలోని సమస్యల‌ను పరిష్కరించేందుకు తన శాయ శక్తులా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

అనంతరం అసోసియేషన్‌ సభ్యులు ఆయనను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో అసోసియేషన్‌ అధ్యక్షుడు శ్రీనివాస్‌ గౌడ్‌, ప్రధాన కార్యదర్శి పి. అశోక్‌ బాబు, కోశాధికారి ప్రభాకర్‌, పౌండర్‌ ప్రెసిడెంట్‌ సాయి ప్రసాద్‌, రాజు, లింగం, అనిల్‌, సిద్దిరామేశ్వర్‌, రవీందర్‌, శ్రీనివాస్‌, ల‌డ్డు శంకర్‌, కళ్యాణి, ప్రవీణ్‌ కుమార్‌, జాన్సన్‌ తదిత‌రులు పాల్గొన్నారు.

Check Also

ఘనంగా కెసిఆర్‌ జన్మదిన వేడుకలు

నిజామాబాద్‌, ఫిబ్రవరి 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్రశేఖర్‌ రావు జన్మదిన ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *