Breaking News

ముఖ్యమంత్రి మానసపుత్రిక హరితహారం

నిజామాబాద్‌, ఫిబ్రవరి 17

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ముఖ్యమంత్రి కేసీఆర్‌ మానస పుత్రికగా భావించి ఎంతో ప్రాముఖ్యతతో హరిత హారం కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారని జిల్లా పరిషత్‌ చైర్మన్‌ విట్టల్‌ రావు తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ పుట్టినరోజు సందర్భంగా సోమవారం మాక్లూర్‌ ఎంపీడీవో కార్యాల‌య ఆవరణలో రూపా నివాస్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో విద్యార్థుల‌కు మొక్కలు, పరీక్ష ప్యాడ్స్‌, పెన్నులు పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.

ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ మానవ మనుగడకు చెట్లు ఎంత ముఖ్యమో ఆ ప్రాముఖ్యాన్ని గుర్తించి ముఖ్యమంత్రి తన మాసపత్రికగా హరితహారం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారన్నారు. విద్యార్థులందరూ భవిష్యత్‌ తరాల‌కు అత్యంత అవసరమైన ప్రాణవాయువు కొరకు మొక్కలు నాటి రక్షించాల‌ని ఆయన పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్‌ నారాయణరెడ్డి మరో ముఖ్య అతిథిగా మాట్లాడుతూ భావితరాల‌కు మంచి వాతావరణాన్ని ఇవ్వాల‌నే తపనతో ముఖ్యమంత్రి హరితహారం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని తెలిపారు.

గత మూడు నాలుగు సంవత్సరాలుగా నిర్వహిస్తున్న కార్యక్రమం వ‌ల్ల‌ ఎక్కడికి వెళ్లిన మొక్కలు, చెట్లు కనిపిస్తున్నాయని, ఇప్పటికే పలు కారణా వ‌ల్ల‌ చెట్లు ధ్వంసం కావడంతో వాతావరణంలో ఉష్ణోగ్రతలు పెరిగి పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు. హరితహారం వ‌ల్ల‌ పచ్చదనం కనిపిస్తున్నదని మరో మూడు నాలుగేళ్లలో చ‌ల్ల‌ని వాతావరణం మనకు ఏర్పడే అవకాశం ఉన్నదని తెలిపారు.

వాతావరణ పరిస్థితులు సమతూకంలో ఉన్నప్పుడే జీవకోటికి మనుగడ సాఫీగా సాగుతుందని, ఈ విషయాన్ని అందరూ గుర్తించి ప్రతి ఒక్కరు కూడా ముఖ్యమంత్రి ఇచ్చిన పిలుపును అందుకొని మొక్కల‌ను పెంచి సంరక్షించడానికి ముందుకు రావాల‌ని పిుపునిచ్చారు.

విద్యార్థులు షార్ట్‌ కట్స్‌ గురించి కాకుండా కష్టపడి చదివి మంచి జ్ఞానంతో పదో తరగతి పరీక్షలు రాసి భవిష్యత్తుకు మంచి బాటలు వేసుకోవాల‌ని సూచించారు. కార్యక్రమంలో మాక్లూర్‌ ఎంపీపీ ప్రభాకర్‌ అధ్యక్షత వహించారు. నుడా చైర్మన్‌ ప్రభాకర్‌ రెడ్డి, ప్రజాప్రతినిధులు, అధికారులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Check Also

టోకెన్లు ఉన్నవారే కంట్రోల్‌ దుకాణానికి రావాలి

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల‌ ప్రకారం ఆహార భద్రత కార్డు ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *