Breaking News

Daily Archives: February 18, 2020

సైనిక సహాయ నిధి అందజేత

నిజామాబాద్‌, ఫిబ్రవరి 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పుల్వామా ఉగ్రదాడి జరిగి సంవత్సర కాలం పూర్తయిన సందర్భంగా అమర సైనికుల‌ కుటుంబాల సహాయార్థం వివేకానంద యువ సంఘటన్‌ వారిచే నిధి సేకరించారు. నిజామాబాద్‌ నగరంలోని వివిధ ప్రదేశాల‌లో ప్రజల‌ నుంచి స్వచ్చందంగా సేకరించిన మొత్తం నిధిని జిల్లా సైనిక సంక్షేమ అధికారి రమేష్‌కు మంగళవారం అందజేశారు. సేకరించిన మొత్తం 71 వేల‌ 419 రూపాయల‌ డిడిని మంగళవారం ఉదయం వారి కార్యాల‌యంలో కలిసి యువ సంఘటన్ ప్రతినిధులు అందజేశారు. ఈ సందర్భంగా ...

Read More »

ప్రభుత్వ రంగ సంస్థల‌ను కాల‌రాస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు

కామారెడ్డి, ఫిబ్రవరి 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మంగళవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని గంజ్‌ ధర్మశాల‌లో భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ నిర్మాణ మహాసభ నిర్వహించారు. సభకు ముఖ్య అతిధిగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలు పశ్య పద్మ హాజరై మాట్లాడారు. కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం పలు ప్రభుత్వ రంగ సంస్థల‌ను కార్పొరేట్‌ సంస్థల‌కు కట్టబెడుతూ కార్మికుల‌ హక్కుల‌ను కాల‌రాస్తుందని ధ్వజమెత్తారు. చాయ్‌ వాలా అంటూ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోడీ ప్రస్తుతం బడుగు, బహీన వర్గాల‌ ...

Read More »

సిపిఐ జిల్లా ప్రధాన కార్యదర్శిగా దశరథ్‌

కామారెడ్డి, ఫిబ్రవరి 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మంగళవారం కామారెడ్డి జిల్లా నిర్మాణ మహాసభలో రాష్ట్ర కమిటీ ఆదేశాల‌ మేరకు సీపీఐ జిల్లా కార్యదర్శిగా ఎల్‌. దశరథ్‌ని నియమిస్తూ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు పశ్య పద్మ ప్రకటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అతిచిన్న వయస్సులోనే విద్యార్థి నాయకుడిగా, యువజన నాయకుడిగా పని చేశారని అందుకు గాను దశరథ్‌ రాష్ట్ర కమిటీ ఆదేశాల‌ మేరకు నిర్మాణ మహా సభలో సీపీఐ జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారన్నారు. ఈ సందర్భంగా దశరథ్‌ మాట్లాడుతూ ...

Read More »

ఇంటి పన్నుతోనే గ్రామాల అభివృద్ధి

నిజాంసాగర్‌, ఫిబ్రవరి 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఇంటి పన్ను తొనే గ్రామ అభివ ృద్ధి చెందుతుందని ఎంపీవో అబ్బాగౌడ్‌ అన్నారు, నిజాంసాగర్‌ మండల‌ కేంద్రంలోని బంజపల్లి గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ ఇంటి పన్ను 60 వేల 780 రూపాయ‌లు వసూలు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు రఘుపతి రెడ్డి ,రవికుమార్‌, క్యాసప్ప, సంధ్యారాణి, కారోబార్‌ సాయిలు తదితరులు ఉన్నారు.

Read More »

ఎమ్మెల్యేను సన్మానించిన సొసైటీ సభ్యులు

నిజాంసాగర్‌, ఫిబ్రవరి 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ మండలంలోని అచ్చంపేట్‌ సొసైటీ చైర్మన్‌ నరసింహారెడ్డి, వైస్‌ చైర్మన్‌ శ్రీనివాస్‌లు కలిసి రాష్ట్ర అసెంబ్లీ ప్యానల్‌ స్పీకర్‌ జుక్కల్‌ ఎమ్మెల్యే హన్మంత్‌ షిండే నివాసంలో పూల‌మాల‌లు, శాలువాతో ఘనంగా సత్కరించారు. ఎమ్మెల్యే సొసైటీ చైర్మన్‌ను శుభాకాంక్షలు తెలిపి అభినందించారు. కార్యక్రమంలో ఎంపీపీ పీ.జ్యోతి, దుర్గా రెడ్డి, ఎయంసి ఉపాధ్యక్షుడు గైని విఠల్‌, మండల సర్పంచ్‌ల‌ సంఘం అధ్యక్షులు రమేష్‌ గౌడ్‌, మాగి సర్పంచ్‌ అంజయ్య, నాయకులు శ్రీకాంత్‌ రెడ్డి, రమేష్‌ కుమార్‌, ...

Read More »

నెట్‌బాల్‌ జట్టు ఎంపిక పోటీలు ప్రారంభం

డిచ్‌పల్లి, ఫిబ్రవరి 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అల్‌ ఇండియా ఇంటర్‌ యూనివర్సిటీ నెట్‌ బాల్‌ ఛాంపియన్‌ షిప్‌ పోటీల‌లో పాల్గొనేందుకు తెలంగాణ యూనివర్సిటీ జట్టు ఎంపిక పోటీలు బుధవారం తెలంగాణ యూనివర్సిటీలో ప్రారంభమయ్యాయి. పోటీలు యూనివర్సిటీ ఆఫ్‌ కాళికట్‌లో మార్చి నెల‌లో జరగనున్నాయి. ఈ మేరకు వర్సిటీ పరీక్షల‌ నియంత్రణ అధికారి ఘంటా చంద్ర శేఖర్‌ జట్టు ఎంపిక పోటీలు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అల్‌ ఇండియా స్థాయిలో పోటీల్లో పాల్గొనేందుకు వర్సిటీకి పిలుపు రావడం అభినందనీయమని ...

Read More »

20న విద్యుత్‌ అంతరాయం

నిజామాబాద్‌, ఫిబ్రవరి 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నెల‌వారి మరమ్మతుల‌ కారణంగా ఈనెల 20వ తేదీ ఉదయం 9 గంటల‌ నుంచి సాయంత్రం 4 గంటల‌ వరకు విద్యుత్‌ సరఫరాలో అంతరాయం ఉంటుందని సంబంధిత శాఖాధికారులు వెల్ల‌డిరచారు. తిల‌క్‌గార్డెన్‌ డి`2 సబ్‌స్టేషన్‌ ఉపకేంద్రం పరిధిలోని సరస్వతి నగర్‌, ఎల్ల‌మ్మగుట్ట, ఖలీల్‌వాడి, బోయిగల్లి, పూసల‌గల్లి, కుమార్‌గల్లీ, వీక్లిమార్కెట్‌, తిరుమల‌ టాకీస్‌ రోడ్డు, మార్వాడీ గల్లి, బస్టాండ్‌ ఏరియా, ద్వారకానగర్‌, పోలీసు లైన్‌, ప్రగతినగర్‌ ప్రాంతాల్లో విద్యుత్‌ అంతరాయం ఉంటుందని వినియోగదారులు ఇందుకు సహకరించాల‌ని ...

Read More »

పంట రుణాలు ఇప్పిస్తాం

బీర్కూర్‌, ఫిబ్రవరి 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మంగళవారం బీర్కూర్‌ గ్రామంలోని గ్రామ చావిడిలో రెవెన్యూ సిబ్బంది నుండి బీర్కూర్‌ వ్యవసాయ విస్తరణ అధికారి శ్రావణ్‌ కుమార్‌ వివరాలు సేకరించారు. ప్రస్తుత రబీ సీజన్‌కు గాను పంట రుణాల‌ను పొందని రైతుల‌ను, 10 జూన్‌ 2019 వ తేదీ తరువాత తెలంగాణా ప్రభుత్వం నుంచి వచ్చిన కొత్త పట్టేదారు పాసుపుస్తకాలు రైతు వివరాలు సర్వే నెంబర్లు వాటి క్రింద గల‌ విస్తీర్ణము వివరాలు గ్రామ పహాని, రెవెన్యూశాఖ దగ్గర గ ల ...

Read More »