Breaking News

ప్రభుత్వ రంగ సంస్థల‌ను కాల‌రాస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు

కామారెడ్డి, ఫిబ్రవరి 18

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మంగళవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని గంజ్‌ ధర్మశాల‌లో భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ నిర్మాణ మహాసభ నిర్వహించారు. సభకు ముఖ్య అతిధిగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలు పశ్య పద్మ హాజరై మాట్లాడారు. కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం పలు ప్రభుత్వ రంగ సంస్థల‌ను కార్పొరేట్‌ సంస్థల‌కు కట్టబెడుతూ కార్మికుల‌ హక్కుల‌ను కాల‌రాస్తుందని ధ్వజమెత్తారు.

చాయ్‌ వాలా అంటూ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోడీ ప్రస్తుతం బడుగు, బహీన వర్గాల‌ గురించి పట్టించుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. మోడీ ప్రభుత్వం దేశంలోని బడా బాబుల‌కు, పెట్టుబడి దారుల‌కు దేశంలోని సహజ వనరుల‌ను కట్టబెడుతున్నారని ఆరోపించారు. తద్వారా సహజ వనరులు కొందరికి మాత్రమే అందుతున్నాయన్నారు. .ఆర్‌ఎస్‌ఎస్‌ కనుసన్నల్లో భాజపా పనిచేస్తుందని, మోడీ ప్రభుత్వం లౌకిక వాదానికి తూట్లు పొడుస్తూ హిందుత్వ వాదానికి తెరలేపుతుందన్నారు.

మతోన్మాదం పెరగడంతో పాటు మత ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయని, అంతే కాకుండా ప్రశ్నించిన వారిపై దేశద్రోహ కేసులు బనాయించడం సిగ్గు చేటని పద్మ పేర్కొన్నారు. మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కోటి ఉద్యోగాలు ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన తరువాత యువతను తప్పుదారి పట్టిస్తున్నారని పశ్య పద్మ ఆరోపించారు. అలాగే రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ నియంత పాల‌న కొనసాగిస్తున్నారని అన్నారు.

నీళ్లు, నిధులు, నియామకాలు, అంటూ తెలంగాణ ఉద్యమాన్ని నడిపిన కేసీఆర్‌ రాష్ట్రం వచ్చిన తరువాత వాటి గురించి పట్టించుకోవడం లేదని చెప్పారు. కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి వి.ఎల్‌ నర్సింహ రెడ్డి, జిల్లా సహాయ కార్యదర్శులు బాల‌రాజు, దుబ్బాస్‌ రాములు, జిల్లా కార్యవర్గ సభ్యుడు దశరథ్‌, జిల్లా కార్యవర్గ సభ్యులు రాజమని, మల్లేష్‌, నర్సింలు భూమన్న, లింగం, శ్యామల‌, రేణుక, రాజశేఖర్‌, రాజమని, రాజిరెడ్డి, ప్రవీణ్‌, నరేష్‌, మనోజ్‌, బీరయ్య, గాంగయ్య, సైదులు, 70 మంది కార్యకర్తలు పాల్గొన్నారు.

Check Also

కామారెడ్డి మున్సిపల్‌ ఫ్లోర్‌ లీడర్‌గా చాట్ల రాజేశ్వర్‌

కామారెడ్డి, మే 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లాలో బుధవారం జరిగిన సమావేశంలో మాజీ మంత్రి, ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *