Breaking News

సిపిఐ జిల్లా ప్రధాన కార్యదర్శిగా దశరథ్‌

కామారెడ్డి, ఫిబ్రవరి 18

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మంగళవారం కామారెడ్డి జిల్లా నిర్మాణ మహాసభలో రాష్ట్ర కమిటీ ఆదేశాల‌ మేరకు సీపీఐ జిల్లా కార్యదర్శిగా ఎల్‌. దశరథ్‌ని నియమిస్తూ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు పశ్య పద్మ ప్రకటించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అతిచిన్న వయస్సులోనే విద్యార్థి నాయకుడిగా, యువజన నాయకుడిగా పని చేశారని అందుకు గాను దశరథ్‌ రాష్ట్ర కమిటీ ఆదేశాల‌ మేరకు నిర్మాణ మహా సభలో సీపీఐ జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారన్నారు.

ఈ సందర్భంగా దశరథ్‌ మాట్లాడుతూ మతోన్మాదనికి వ్యతిరేకంగా బడుగు, బల‌హీన వర్గాల‌ కోసం ప్రజల‌ కోసం పోరాటాలు నిర్వహిస్తానని ఎన్‌ఆర్‌సికి వ్యతిరేకంగా పోరాటాలు చేస్తానని ఆయన అన్నారు. తనపై నమ్మకంతో బాధ్యత అప్పగించిన రాష్ట్ర కమిటీకి దశరథ్‌ ధన్యవాదాలు తెలిపారు.

Check Also

హైదరాబాద్‌ మినహా కరోనా కేసుల్లో నిజామాబాద్‌ జిల్లా తెలంగాణలో నెంబర్‌ వన్‌…

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ ప్రత్యేకం : కరోనా వైరస్‌ ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న విషయం అందరికీ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *