Breaking News

గ్రామ పంచాయతీకి ట్రాక్టర్‌ అందజేత

నిజాంసాగర్‌, ఫిబ్రవరి 19

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్ మండలం వెల్గ‌నూర్‌ గ్రామ పంచాయతీకి నూతన ట్రాక్టర్‌ను మండల‌ సర్పంచ్‌ల‌ సంఘం అధ్యక్షుడు రమేష్‌ గౌడ్‌ అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్‌ మాట్లాడుతూ పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా ప్రతి గ్రామ పంచాయతీకి టాక్టర్‌ను కొనుగోలు చేయడం జరిగిందని తెలిపారు.

గ్రామంలోని ప్రజలు చెత్తను ట్రాక్టర్‌లో వేసిన తర్వాత డంపింగ్‌ యాడ్‌కు తరలించడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి సుధాకర్‌, ఎంపీటీసీ జనార్ధన్‌, మాగి సర్పంచ్‌ కమ్మరి కత్త ఆంజయ్య, నాయకులు శ్రీకాంత్‌ రెడ్డి, గైని రమేష్‌, గ్రామస్తులు, గ్రామ పెద్దలు తదిత‌రులు ఉన్నారు.

The following two tabs change content below.

Check Also

తాగునీటి సమస్య ఏర్పడితే ఫోన్‌ చేయండి

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వేసవిలో తాగునీటి సమస్యు ఎదురైతే 9154220064 నెంబర్‌కు ఫోన్‌ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *