Breaking News

బ్యాంక్‌ లింకేజీ రుణాలు నెల‌ చివరికల్లా పూర్తిచేయాలి

రెంజల్‌, ఫిబ్రవరి 20

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : డ్వాక్రా మహిళా సంఘాలు బ్యాంక్‌ లింకేజీ రుణాలు ఈనెల‌ చివరికల్లా సలకాలంలో పూర్తిచేయాల‌ని జిల్లా ప్రాజెక్టు మేనేజర్‌ సంధ్యారాణి అన్నారు. మండల‌ కేంద్రంలోని మహిళా సమాఖ్య భవనంలో మహిళా సమాఖ్య అధ్యక్షురాలు బేగరి గంగామణి అధ్యక్షతన మండల‌ సమాఖ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 2019`20లో తీసుకున్న బ్యాంక్‌ లింకేజీ రుణాలు పూర్తిచేసి మరిన్ని నిధులు పొందాల‌ని సూచించారు.

అనంతరం ఏపిఎం చిన్నయ్య మాట్లాడుతూ మండలంలోని అన్ని సంఘాలు సిఐఎస్‌ సామాజిక నిధుల‌ వంద శాతం కట్టుకోవాల‌ని గ్రామసంఘాల అధ్యక్షుల‌ను కోరారు. అలాగే ప్రభుత్వం ప్రవేశపెట్టిన పల్లె ప్రగతిలో భాగంగా తడి, పొడి చెత్త బుట్టల‌ను ప్రతి మహిళా ఉపయోగించుకునేలా డ్వాక్రా సంఘాల ఆధ్వర్యంలో అవగాహన కల్పించాల్సిన అవసరముందని చిన్నయ్య చెప్పారు.

మండలంలోని గ్రామ సంఘాల‌ ఆర్థిక లావాదేవీల‌కు సంబంధించిన రికార్డుల‌ను జిల్లా ప్రాజెక్టు మేనేజర్‌ సంధ్యారాణి పరిశీలించారు. గ్రూపు వివరాల‌ను ప్రతినెల‌ పుస్తకాల‌లో పూర్తిచేసుకొని, ఏఓలు ఏ గ్రేడ్‌లో నిల‌వాల‌ని ఆమె సూచించారు. ఆమె వెంట సిబిఓ మాధవరావు, ఏపిఎం సరోజని, సిసిలు శ్యామల‌, భాస్కర్‌, రాజయ్య, శివకుమార్‌, కృష్ణ, సునీత, అకౌంటెంట్‌ అనురాధ, ప్రతినిధులు ల‌క్ష్మీ, సౌజన్య, సిబ్బంది తస్లీం తదితరులున్నారు.

The following two tabs change content below.

Check Also

తాగునీటి సమస్య ఏర్పడితే ఫోన్‌ చేయండి

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వేసవిలో తాగునీటి సమస్యు ఎదురైతే 9154220064 నెంబర్‌కు ఫోన్‌ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *