Breaking News

నిజాంసాగర్‌ నీటిని సద్వినియోగం చేసుకోవాలి

నిజామాబాద్‌, ఫిబ్రవరి 20

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నీటిపారుదల సల‌హా మండలి సమావేశంలో తీసుకున్న నిర్ణయం ప్రకారం నిజాంసాగర్‌ ప్రాజెక్టు నుండి ఈనెల 20వ తేదీ నుండి డి 27 నుండి డి 38 కాలువ‌ ద్వారా విడుదల‌ చేస్తున్న సాగునీటిని రైతులు సద్వినియోగం చేసుకోవాల‌ని జిల్లా కలెక్టర్‌ నారాయణరెడ్డి కోరారు.

గురువారం క్యాంపు కార్యాల‌యం నుండి జిల్లా అధికారులు, సంబంధిత అధికారుల‌తో సెల్‌ కాన్ఫరెన్స్‌ నిర్వహించి తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ డి 27 నుండి 38 డిస్ట్రిబ్యూటరీ కాలువ‌ క్రింద గల‌ కోటగిరి, బోధన్‌, వర్ని మండలాల్లోని సాగు భూముల‌ పరిధిలో వేసిన పంటల‌ను కాపాడడానికి రోజుకు 1200 క్యూసెక్కుల‌ నీటిని మొదటి విడతగా తడి కోసం విడుదల‌ చేస్తున్నారని ఆయన తెలిపారు.

అధికారులు నీరు సక్రమంగా ఆయా భూముల‌కు అందే విధంగా చర్యలు తీసుకోవాల‌ని, లీకేజీలు రాకుండా చూసుకోవాల‌ని ఆదేశించారు. నీరు వృధా కాకుండా ఇటు అధికారులు అటు రైతులు కృషిచేయాల‌ని ఆయన కోరారు. కార్యక్రమంలో నీటి పారుదల‌ శాఖ ఎస్‌ఈ ఆత్మారాం తదితరులు పాల్గొన్నారు.

The following two tabs change content below.

Check Also

తాగునీటి సమస్య ఏర్పడితే ఫోన్‌ చేయండి

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వేసవిలో తాగునీటి సమస్యు ఎదురైతే 9154220064 నెంబర్‌కు ఫోన్‌ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *