Breaking News

గ్రామాలో గ్రీన్‌ ప్లాన్‌ కోసం ప్రణాళికలు సిద్దం చేసుకోవాలి

రెంజల్‌, ఫిబ్రవరి 20

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని ఆయా గ్రామాల‌లో గ్రీన్‌ ప్లాన్‌ ప్రణాళికలు సిద్దం చేసుకోవాల‌ని ఎంపిడివో గోపాల‌కృష్ణ అన్నారు. మండల‌ పరిషత్‌ కార్యాల‌యంలోని సమావేశ మందిరంలో పంచాయతీ కార్యదర్శులు, క్షేత్ర సహాయకులు, అంగన్‌వాడి కార్యకర్తలు, ఆశా వర్కర్లతో గురువారం సమావేశం నిర్వహించారు.

వారినుద్దేశించి ఎంపిడివో మాట్లాడారు. 2020`21 ఏడాదికి సంబంధించిన హరితహారం మొక్కల‌కు సంబంధించిన నర్సరీ ఏర్పాటు విషయం పకడ్బందీగా చేపట్టాల‌న్నారు. గ్రామాల‌లో అవసరమున్న అన్ని రకాల‌ మొక్కల‌ పెంపకం కోసం నర్సరీల‌ను సిద్దం చేసుకొని ల‌క్ష్య సాధన వైపు అడుగు వేయాల‌ని ఎంపిడివో ఆదేశించారు. అందుకు ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాల‌ని, అప్పుడే ల‌క్ష్య సాధన సాధ్యమవుతుందని చెప్పారు.

నర్సరీల‌ వద్ద అన్ని రకాల‌ సౌకర్యాల‌ను ఏర్పరుచుకోవాల‌ని పేర్కొన్నారు. సమావేశంలో ఎంపివో గౌస్‌ మోయినోద్దీన్‌, సూపరింటెండెంట్‌ శ్రీనివాస్‌, కార్యదర్శులు యాదగిరి, రఘురాం, శ్రీకాంత్‌, నవీన్‌, శేఖర్‌, సాయిబాబా, సాయిు, బి.రాణి, గౌతమి, రోజా, ఏపివో శరత్‌చంద్ర, సిసిు, క్షేత్ర సహాయకులు, అంగన్‌వాడి కార్యకర్తలు, ఆశా వర్కర్లు పాల్గొన్నారు.

The following two tabs change content below.

Check Also

తాగునీటి సమస్య ఏర్పడితే ఫోన్‌ చేయండి

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వేసవిలో తాగునీటి సమస్యు ఎదురైతే 9154220064 నెంబర్‌కు ఫోన్‌ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *