Breaking News

బాధిత కుటుంబాల‌ను ఆదుకుంటాం

రెంజల్‌, ఫిబ్రవరి 20

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : చనిపోయిన గేదెలు, ఎడ్ల కుటుంబాల‌ను ఆదుకునేందుకు తమ వంతు కృషి చేస్తానని పశు సంవర్దక శాఖాధికారి బాలీక్‌ హైమద్‌ అన్నారు. మండలంలోని నీలా క్యాంపు గ్రామంలో గురువారం తెల్ల‌వారుజామున పలు కుటుంబాల‌ రైతుల‌కు సంబంధించిన మూగజీవులు తీవ్ర అస్వస్థతకు గురై మరణించాయి. విషయాన్ని రైతులు స్థానిక పశు వైద్యాధికారికి వివరించారు.

దీంతో గ్రామానికి వైద్య సిబ్బందిని పంపించి శిబిరాన్ని ఏర్పాటు చేశారు. పరిస్థితిని స్థానిక పశు వైద్యాధికారులు జిల్లా పశు సంవర్ధక శాఖాధికారికి అందించడంతో స్పందించిన ఆయన నీలా క్యాంపు గ్రామనికి చేరుకున్నారు. చని పోయిన, తీవ్ర అస్వస్థతతో బాధ పడుతున్న గేదెలు, ఎడ్లను క్షుణ్ణంగా పరిశీలించారు. ఇటీవలే వైద్య సిబ్బంది ఇచ్చిన గాలి కుంటు వ్యాధి వ్యాక్సీన్‌ ద్వారా ఇలా జరిగిందని చెప్పడంలో వాస్తవం లేదని బాలీక్‌ హైమద్‌ పేర్కొన్నారు.

జిల్లా వ్యాప్తంగా 541 గ్రామాల‌లో మూడున్నర ల‌క్షల‌ గేదెల‌కు గాలికుంటు టీకాలు వేయడం జరిగిందన్నారు. ఎక్కడా జరగనిది ఇక్కడ ఎలా జరుగుతుందని ఆయన ప్రశ్నించారు. ఆరోగ్యంగా ఉండాల‌న్న ఉద్దేశంతోనే ప్రభుత్వం శిబిరాల‌ ద్వారా వ్యాధి నిరోధక టీకాలు వేయిస్తుందని ఆయన గుర్తు చేశారు. గ్రామంలోని రైతుల‌కు చెందిన ఏడు గేదెలు, ఒక ఎద్దు మరణించగా ఒక ఎద్దు మరికొన్ని గేదెలు అస్వస్థతతో ఉన్నాయని చెప్పారు.

వాటిని రక్షించేందుకు సిబ్బంది అందుబాటులో వుండి పరీక్షలు చేపడుతారని బాలీక్‌ హైమద్‌ చెప్పారు. పశుగ్రాసం, వాతావరణంలో చోటుచేసుకున్న మార్పుతోనే ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుందని పశు వైద్యాధికారి బాలీక్‌ హైమద్‌ పేర్కొన్నారు. గేదెలు చనిపోవడంతో రైతులు కన్నీరు పెట్టారు.

The following two tabs change content below.

Check Also

తాగునీటి సమస్య ఏర్పడితే ఫోన్‌ చేయండి

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వేసవిలో తాగునీటి సమస్యు ఎదురైతే 9154220064 నెంబర్‌కు ఫోన్‌ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *