Breaking News

Daily Archives: February 25, 2020

కాల‌నీలు బాగు చేసుకోవాల్సిన బాధ్యత ప్రజల‌దే

ఆర్మూర్‌, ఫిబ్రవరి 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పరిశుభ్రమైన వాతావరణంలో జీవించడానికి ఎవరి కాల‌నీల‌ను వారు బాగు చేసుకోవాల‌ని జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి సూచించారు. పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా మంగళవారం కలెక్టర్‌ ఆర్మూర్‌ మున్సిపాలిటీలో పలు వార్డుల‌లో పర్యటించి ప్రజల‌తో మాట్లాడి సమస్యలు తెలుసుకుని ఎక్కడికక్కడ అధికారుల‌కు సూచనలు చేశారు. ఆయా వార్డు ప్రత్యేక అధికారులు కమిటీ సభ్యుల‌తో ఏం చేయాల‌నే విషయమై చర్చించారు. 18 వ వార్డు రంగాచారి నగర్‌, 17వ వార్డు సంతోష్‌ నగర్‌, 23 ...

Read More »

పల్లె ప్రగతిపై కలెక్టర్‌ వీడియో కాల్‌

కామారెడ్డి, ఫిబ్రవరి 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పల్లె ప్రగతిలో భాగంగా గ్రామాల్లో జరుగుతున్న పనుల‌ను తెలుసుకోవడానికి కలెక్టర్‌ కార్యాయంలో ఏర్పాటు చేసిన పల్లె ప్రగతి పర్యవేక్షణ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్‌ ఏ.శరత్‌ సందర్శించారు. కాజల్‌ ఆప్‌ ద్వారా జరుగుతున్న ఈ విధానాన్ని పరిశీలించారు. పంచాయతీ కార్యదర్శి తిప్పాపూర్‌ గ్రామపంచాయతీ మణుగూరు మండలం భిక్కనూరులో వీడియో కాల్‌ చేసి అక్కడ పనుల‌ను మాట్లాడి ఎలా జరుగుతున్నాయో తెలుసుకున్నారు. అదేవిధంగా ఇచ్చిన సర్క్యుల‌ర్‌ నిబంధనల‌ ప్రకారం పనిచేయాల‌ని హెచ్చరించారు. ఎంపీడీవోలు నాగిరెడ్డిపేట శ్యామల‌, ...

Read More »

దోపిడీ సమాజ మార్పు కోసం కమ్యూనిస్టులు అవసరం

కామారెడ్డి, ఫిబ్రవరి 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మంగళవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆర్‌అండ్‌బి అతిథి గృహంలో సిపిఐ, సిపిఎం(ఐ) ఆధ్వర్యంలో రెడ్‌ బుక్‌ డే లో భాగంగా కమ్యూనిస్టు పార్టీ ప్రణాళిక బుక్‌ను ఆవిష్కరించారు. ఈ సంధర్భంగా డాక్టర్ ల‌చ్చయ, కమ్యూనిస్టు సీనియర్‌ నాయకులు వి.ఎల్‌.నర్సింహ రెడ్డి, ఉపాధ్యాయ సంఘము నాయకులు వేణుగోపాల్‌ మాట్లాడారు. దేశంలో దోపిడీ పెరిగిపోతోందని, ప్రజా సొమ్మును పెద్ద పెద్ద పెట్టుబడిదారుల‌కు దోచి పెడుతున్నారని దీంతో కొందరి వద్దే ల‌క్షల‌ కోట్ల రూపాయలు పోగయ్యాయని ఆందోళన ...

Read More »

సమిష్టి కృషితోనే పట్టణ ప్రగతి

కామారెడ్డి, ఫిబ్రవరి 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సమిష్టి కృషితోనే పట్టణ ప్రగతి సాధ్యమని జిల్లా పాల‌నాధికారి డాక్టర్‌ శరత్‌ అన్నారు. కామారెడ్డి పట్టణంలోని 14, 15, 24, 33 వార్డుల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ప్రజల‌నుద్దేశించి మాట్లాడారు. పట్టణ ప్రగతిలో అనేక సమస్యలు పరిష్కారమవుతాయని పేర్కొన్నారు. పట్టణంలోని సమస్యల‌ పరిష్కారానికి స్వ‌ల్ప‌ దీర్ఘ ప్రణాళికలు రూపొందించాల‌ని సూచించారు. చిన్న చిన్న వాటిని సత్వరమే పరిష్కరించాల‌ని కోరారు. పట్టణాల‌ను సమగ్ర అభివృద్ధి చేయడమే ప్రభుత్వ ల‌క్ష్యమని పేర్కొన్నారు. పురపాలిక ఆదాయంలో పది ...

Read More »

వేతనాలు పెంచాలి

నిజామాబాద్‌, ఫిబ్రవరి 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కేజీబీవీల్లో పనిచేస్తున్న నాన్‌-టీచింగ్‌, వర్కర్స్‌ వేతనాలు పెంచాల‌ని, కేజీబీవీల్లో ఉన్న ఖాళీల‌ను భర్తీ చేయాల‌ని, వర్కర్లకు వీక్లీ ఆఫ్ అమలు చేయాల‌ని తదితర డిమాండ్లతో ప్రగతి శీల‌ కేజీబీవీ వర్కర్స్‌ యూనియన్‌ (ఐఎఫ్‌టియు) ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్‌ కార్యాయం ముందు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా యూనియన్‌ జిల్లా బాధ్యులు ఎం. సుధాకర్‌ మాట్లాడుతూ తెంగాణ రాష్ట్రంలో 475, కామారెడ్డి జిల్లాలో 19 కేజీబీవీ విద్యాయాలు కొనసాగుతున్నాయన్నారు. వీటిలో పనిచేసే అకౌంటెంట్‌, ఏఎన్‌ఎం, ...

Read More »

ఐకెపి అధికారుల‌తో సమీక్ష

కామారెడ్డి, ఫిబ్రవరి 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జనహిత సమావేశమందిరంలో మంగళవారం ఐకెపి అధికారుల‌తో జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ శరత్‌ సమీక్ష నిర్వహించారు. శ్రీనిధి, ఎస్‌హెచ్‌ జి బ్యాంకు రుణాలు మార్చ్‌ 20 లోగా మహిళల‌కు ఇప్పించాల‌ని సూచించారు. ప్రతి గ్రామ సంఘంలో మహిళల‌కు సౌభాగ్య పథకం కింద రుణాలు ఇప్పించి నిరుపేద మహిళల‌ను ఆర్థికంగా ఎదిగే విధంగా చూడాల‌ని కోరారు. సమావేశంలో డిఆర్‌డివో చంద్రమోహన్‌ రెడ్డి, డిపివో సాయన్న, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Read More »

27న ‘కేంద్ర జిఎస్‌టి మీ వద్దకు’ కార్యక్రమం

కామారెడ్డి, ఫిబ్రవరి 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సెంట్రల్‌ జిఎస్‌టి హైదరాబాద్‌ వారు నిర్వహిస్తున్న ‘జిల్లా జిల్లాలో కేంద్ర జీఎస్‌టి మీ వద్దకు’ కార్యక్రమంలో భాగంగా జీఎస్‌టి చట్టానికి సంబంధించిన అన్ని విషయాలో సహాయం అందించడానికి, సందేహాల‌ను నివృత్తి చేయడానికి చీఫ్‌ కమిషనర్‌ మల్లికా ఆర్య, కమిషనర్‌ ఎన్‌ శ్రీధర్‌, అడిషనల్‌ కమిషనర్‌ మురళి క్రిష్ణ, వారి బృందం కామారెడ్డి జిల్లాకు విచ్చేస్తున్నారు. ఈనె 27న మధ్యాహ్నం 2 గంటల‌ నుంచి 5 గంటల‌ వరకు స్థానిక శ్రీ హంస ఫంక్షన్‌ ...

Read More »

కసి, పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు

ఆర్మూర్‌, ఫిబ్రవరి 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : చదవాల‌ని పట్టుదల‌, సాధించాల‌నే కసి ఉంటే ఏది కూడా అసాధ్యం కాదని జిల్లా కలెక్టర్‌ నారాయణరెడ్డి బోధించారు. ఆర్మూర్‌ ప్రభుత్వ జూనియర్‌ కళాశాల‌ వార్షికోత్సవ కార్యక్రమానికి కలెక్టర్‌ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థినీ విద్యార్థుల‌ను ఉద్దేశించి విజయం సాధించడానికి ఏం చేయాలో తెలిపారు. కళాశాల‌కు మంచి చరిత్ర ఉందని, కేవలం 30 శాతం అక్షరాస్యత ఉన్న 1965 సంవత్సరంలో ప్రారంభమైన కళాశాల‌లో ఎంతోమంది చదువుకొని ఉన్నత శిఖరాల‌కు చేరుకున్నారని పేర్కొన్నారు. మంచి ...

Read More »

పల్లె ప్రగతిలో పనులు పెండిరగ్‌ ఉండకూడదు

నిజామాబాద్‌, ఫిబ్రవరి 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పల్లె ప్రగతి కార్యక్రమాల్లో నిర్దేశించిన ఏ పనులు కూడా పెండిరగ్‌ లేకుండా వెంటనే పూర్తి చేయటానికి చర్యలు తీసుకోవాల‌ని జిల్లా కలెక్టర్‌ నారాయణరెడ్డి సంబంధిత అధికారుల‌ను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌ ప్రగతి భవన్‌ సమావేశ మందిరంలో పల్లె ప్రగతికి సంబంధించి విద్యుత్తు సమస్య పరిష్కారంపై విద్యుత్‌ శాఖ అధికారులు, ఎంపీవోల‌తో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పల్లె ప్రగతి 1, 2 లో ముఖ్యంగా విద్యుత్‌ శాఖకు సంబంధించి చెడిపోయిన ...

Read More »