Breaking News

Daily Archives: February 27, 2020

కామారెడ్డిలో పట్టణ ప్రగతి

కామారెడ్డి, ఫిబ్రవరి 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా 47వ వార్డు కౌన్సిల‌ర్‌ గెరిగంటి స్వప్న ల‌క్ష్మీనారాయణ ఆధ్వర్యంలో 4వ రోజు కామారెడ్డి జిల్లా కేంద్రంలోని 47వ వార్డులో పిచ్చి మొక్కలు, చెత్తా చెదారంతో అపరిశుభ్రంగా ఉన్న ప్రాంతాన్ని శుభ్రం చేయించారు. అనంతరం మొక్కలు నాటే కార్యక్రమానికి ముఖ్య అతిథితులుగా మున్సిపల్‌ చైర్మన్‌ కుమారి నిట్టు జాహ్నవి, గడ్డం ఇందుప్రియ చంద్రశేఖర్‌ రెడ్డి పాల్గొని ఆ ప్రాంతంలో మొక్కలు నాటి నీరుపోశారు. కార్యక్రమంలో ...

Read More »

రసాయన శాస్త్రంలో అనిల్‌కు డాక్టరేట్‌

కామారెడ్డి, ఫిబ్రవరి 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రసాయన శాస్త్రం విభాగంలో పరిశోధక విద్యార్థి తల‌కొక్కుల‌ అనిల్‌కు ఉస్మానియా విశ్వవిద్యాయం డాక్టరేట్‌ ప్రదానం చేసింది. స్టీరియో సెలెక్టివ్‌ సింథిసిస్‌ ఆఫ్‌ నాచురల్‌ లాక్టోన్స్‌ ఆస్పర్జిల్లాయిడ్‌ డి, డైసిడియోటైడ్‌ ఎ,బి, డిహైడ్రోరిసోర్సిలైడ్‌, సింథసిస్‌ ఆఫ్‌ ఆర్టికిక్కియనోల్‌ ఎ.సి, ఆల్పిస్సిమకౌమరిన్‌ `డి అనే అంశంపై సమర్పించిన పరిశోధనాత్మక సిద్ధాంత గ్రంథానికి అనిల్‌కు డాక్టరేట్‌ ప్రదానం చేసినట్టు ఓయు పరీక్షల నియంత్రణాధికారి ప్రొఫెసర్‌ శ్రీరాం వెంకటేశ్‌ తెలిపారు. కామారెడ్డి, బతుకమ్మ కుంట పద్మానగర్‌ కానీకి చెందిన ...

Read More »

మహిళ కడుపులో ఐదు కిలోల‌ కంతి

నిజాంసాగర్‌, ఫిబ్రవరి 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి డివిజన్‌ కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రిలో గురువారం ఉదయం ఓ మహిళ కడుపు నుండి 5 కిలోల‌ కంతిని శస్త్రచికిత్స చేసి తీసినట్టు ప్రముఖ సర్జన్‌ ఆసుపత్రి మేనేజింగ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌. బి.నాగేశ్వరరావు తెలిపారు.

Read More »

చెట్లు నరికితే కఠిన చర్యలు

నిజామాబాద్‌, ఫిబ్రవరి 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : చెట్లను ఎక్కడ ధ్వంసం చేసినా కఠినంగా వ్యవహరించాల‌ని అవసరమైతే క్రిమినల్‌ కేసులు కూడా నమోదు చేయాల‌ని జిల్లా కలెక్టర్‌ నారాయణరెడ్డి సంబంధిత అధికారుల‌ను ఆదేశించారు. గురువారం సాయంత్రం కలెక్టరేట్‌ ప్రగతి భవన్‌ సమావేశ మందిరంలో జిల్లాస్థాయి అటవీ సంరక్షణ కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. జిల్లా అటవీ అధికారి సునీల్‌, అదనపు సిపి ఉషా విశ్వనాథ్‌ తదితర అధికారుల‌తో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కలెక్టర్లతో రాష్ట్ర ముఖ్యమంత్రి కాన్ఫరెన్స్‌ సందర్భంగా ఈ ...

Read More »

29న అప్రెంటిస్‌ మేళా

నిజామాబాద్‌, ఫిబ్రవరి 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లాలోని ప్రభుత్వ, ప్రయివేటు ఐటిఐలలో పాసయిన విద్యార్థుకు ఈనెల‌ 29న ఉదయం 10 గంటల‌ నుంచి నిజామాబాద్‌ ప్రభుత్వ బాలుర ఐటిఐలో అప్రెంటిస్‌ మేళా నిర్వహిస్తున్నట్టు ప్రిన్సిపాల్‌ కోటిరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. డీజిల్‌ మెకానిక్‌, మోటార్‌ మెకానిక్‌, ఫిట్టర్‌ పాసైన, ఉత్తీర్ణత పొందిన విద్యార్థులు అర్హుల‌న్నారు. విద్యార్థులు తమ ఒరిజినల్‌ సర్టిఫికెట్లతో పాటు ఒక సెట్‌ జిరాక్సు ప్రతులు తీసుకొని అప్రెంటిస్‌కు హాజరు కావాల‌ని సూచించారు. అప్రెంటిస్ కాలంలో నెల‌కు ...

Read More »

రైతుల‌కు అందుబాటులో ఉంటా

రెంజల్‌, ఫిబ్రవరి 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైతుల‌కు అందుబాటులో ఉంటూ రైతుల‌ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తానని రెంజల్‌ నూతన విండో చైర్మన్‌ అసాని ప్రశాంత్‌ అన్నారు. గురువారం మండలంలోని రెంజల్‌ సహకార సంఘం చైర్మన్‌గా ప్రశాంత్‌ బాధ్యతలు చేపట్టారు. విండో కార్యాయంలో అధికారులు, టిఆర్‌ఎస్‌ నాయకుల‌ సమక్షంలో చైర్మన్‌గా ప్రమాణం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుల‌కు అందుబాటులో ఉంటూ రైతు అభివృద్ధికి ఎ్లవేళలా సహాయ సహకారాలు అందిస్తూ సహకార సంఘాన్ని మరింత అభివృద్ధి కోసం ...

Read More »

ఉచిత కంటి వైద్య శిబిరం

రెంజల్‌, ఫిబ్రవరి 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని తాడ్‌ బిలోలి గ్రామంలో గురువారం ల‌యన్స్‌ క్లబ్‌ బోధన్‌ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత కంటి వైద్య శిబిరాన్ని సర్పంచ్ వెల్మ‌ల‌ సునీత ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ల‌యన్స్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో గ్రామంలో ఉచిత కంటి శిబిరాన్ని ఏర్పాటు చేసి రోగుల‌కు ఉచితంగా మందులు పంపిణీ చేయడం అభినదనీయమని, ఇలాంటి సేవకార్యక్రమం చేయడం ద్వారా గ్రామంలో ఉన్న పేద కుటుంబాల‌కు తోడ్పాటును అందించినవారమవుతామన్నారు. అనంతరం వైద్యురాలు శ్వేత ...

Read More »

ఆజాద్‌ చంద్రశేఖర్‌కు ఘన నివాళి

ఆర్మూర్‌, ఫిబ్రవరి 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారత జాతీయోద్యమ పోరాట యోధుడు చంద్రశేఖర్‌ ఆజాద్‌ 89 వ వర్ధంతిని ఆర్మూర్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పివైఎల్‌, పిడిఎస్‌యు ఆధ్వర్యంలో కుమార్‌ నారాయణ భవన్‌లో ఆజాద్‌ చిత్రపటానికి పూల‌మాల‌లు వేసి నివాళుర్పించారు. ఈ సందర్భంగా పివైఎల్‌ రాష్ట్ర నాయకులు సుమన్‌, పిడిఎస్‌యు ఆర్మూర్‌ ఏరియా ప్రధాన కార్యదర్శి నిఖిల్‌ మాట్లాడారు. బ్రిటిషర్ల వల‌స పాల‌నకు వ్యతిరేకంగా చంద్రశేఖర్‌ ఆజాద్‌ పిన్న వయసులోనే పోరాటంలో పాల్గొని భారత స్వాతంత్య్రం కోసం పాతికేళ్ల ...

Read More »

పట్టణ అభివృద్దికి నిధులు

ఆర్మూర్‌, ఫిబ్రవరి 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పట్టణ ప్రగతి కార్యక్రమంలోభాగంగా ఆర్మూర్‌ పట్టణంలో గురువారం ఆర్మూర్‌ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి ఒక్క కాల‌నీ వాసులు తాము నివసించే కాల‌నీ పరిశుభ్రంగా ఉంచుకోవాల‌ని, పాత స్థలాల్లో మొక్కలు తీయించి వాటిని శుభ్రంగా చేయిస్తున్నామని, తడి, పొడి చెత్త వేరు వేరు డబ్బాల‌లో వేసి మున్సిపల్‌ నుండి ఏర్పాటు చేసిన చెత్త సేకరణ వాహనంలో నే వేయాల‌ని, ఖాళీ ...

Read More »

నర్సరీలు పరిశీలించిన కలెక్టర్‌

ఆర్మూర్‌, ఫిబ్రవరి 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వేల్పూర్‌, కమ్మర్‌పల్లి మండలాల్లో జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి పర్యటించి నర్సరీల‌ను, తహసిల్దార్‌ కార్యాల‌యాల‌ను పరిశీలించారు. గురువారం కలెక్టర్ వేల్పూర్‌ తహసిల్దార్‌ కార్యాల‌యంలో పర్యటించి అన్ని విభాగాల‌ను పరిశీలించారు. ప్రభుత్వం కొత్తగా ఎనిమిది బ్యాటరీలు అందించగా దానికి యుపిఎస్‌ అవసరం ఉన్నందున కలెక్టరేట్‌ ఏఓకు ఫోన్‌ చేసి అన్ని తహసిల్దార్‌ కార్యాల‌యాల్లో ఈ పని చేయడానికి అవసరమైన చర్యలు తీసుకోవాల‌న్నారు. రెండు మండలాల కార్యాల‌యాల్లో కూడా మొక్కలు నాటడానికి ఇంకా స్థలం ఖాళీగా ...

Read More »

వేల్పూర్‌ హరితహారం భేష్‌

ఆర్మూర్‌, ఫిబ్రవరి 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా వేల్పూర్ మండలంలో గురువారం జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేసారు. వేల్పూరు నర్సరీ, వేల్పూరు నుండి అర్‌ అండ్‌ బి రోడ్డుకు ఇరువైపులా నాటిన మొక్కల‌ను పరిశీలించి ఎండిపోయిన చెట్లు చూసి రైతుల‌కు సూచనలు చేశారు. రైతులు పొలం గట్ల వెంబడి ఉన్న చెట్లకు తుక్కు పోసి చెట్లను కాల్చ‌డం లాంటివి చేస్తే కఠిన చర్యలు ఉంటాయన్నారు. చెట్లు ఎందుకు ఎండిపోతున్నాయో గుర్తించి హార్టి క‌ల్చ‌ర్‌ డిపార్ట్‌ ...

Read More »

పరీక్ష కేంద్రాల్లో మౌలిక వసతులు కల్పించాలి

కామారెడ్డి, ఫిబ్రవరి 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలుగునాడు విద్యార్థి సమాఖ్య టిఎన్‌ఎస్‌ఎఫ్‌, తెలంగాణ జన సమితి విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో కామారెడ్డి పట్టణ కేంద్రంలోని ఇంటర్మీడియట్‌ నోడల్‌ అధికారి నాగరాజుకు వినతిపత్రం అందజేశారు. మార్చి 4వ తేదీ నుండి నిర్వహించనున్న ఇంటర్మీడియట్‌ పరీక్షా కేంద్రాల్లో మౌలిక వసతులు కల్పించాల‌ని, ఎండ తీవ్రతను దృష్టిలో పెట్టుకొని నీటి సదుపాయాన్ని, పరీక్ష కేంద్రాల్లో వెలుతురు సరిగా ఉండే విధంగా, ఏఎన్‌ఎరు అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాల‌ని కోరారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న ...

Read More »

సమస్యలు తెలుసుకున్నాము- పరిష్కారానికి చర్యలు తీసుకుంటాము

ఆర్మూర్‌, ఫిబ్రవరి 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పట్టణ ప్రగతిలో భాగంగా గల్లి గల్లి తిరిగి సమస్యలు తెలుసుకున్నామని, ప్రణాళికతో పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని రాష్ట్ర రోడ్లు -భవనాల‌, శాసనసభ వ్యవహారాల‌ శాఖామాత్యులు వేముల‌ ప్రశాంత్‌ రెడ్డి తెలిపారు. పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా ఆయన గురువారం భీమ్‌గల్‌ మున్సిపాలిటీ పరిధిలో 10 వ వార్డు హరిజనవాడలోను, రెండవ వార్డులోనూ కలెక్టర్‌ నారాయణరెడ్డి ఇతర అధికారుల‌తో కలిసి గల్లి గల్లి తిరిగి ప్రజల‌తో మాట్లాడి స్వయంగా సమస్యలు పరిశీలించారు. ఈ సందర్భంగా ...

Read More »