Breaking News

రసాయన శాస్త్రంలో అనిల్‌కు డాక్టరేట్‌

కామారెడ్డి, ఫిబ్రవరి 27

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రసాయన శాస్త్రం విభాగంలో పరిశోధక విద్యార్థి తల‌కొక్కుల‌ అనిల్‌కు ఉస్మానియా విశ్వవిద్యాయం డాక్టరేట్‌ ప్రదానం చేసింది.

స్టీరియో సెలెక్టివ్‌ సింథిసిస్‌ ఆఫ్‌ నాచురల్‌ లాక్టోన్స్‌ ఆస్పర్జిల్లాయిడ్‌ డి, డైసిడియోటైడ్‌ ఎ,బి, డిహైడ్రోరిసోర్సిలైడ్‌, సింథసిస్‌ ఆఫ్‌ ఆర్టికిక్కియనోల్‌ ఎ.సి, ఆల్పిస్సిమకౌమరిన్‌ `డి అనే అంశంపై సమర్పించిన పరిశోధనాత్మక సిద్ధాంత గ్రంథానికి అనిల్‌కు డాక్టరేట్‌ ప్రదానం చేసినట్టు ఓయు పరీక్షల నియంత్రణాధికారి ప్రొఫెసర్‌ శ్రీరాం వెంకటేశ్‌ తెలిపారు.

కామారెడ్డి, బతుకమ్మ కుంట పద్మానగర్‌ కానీకి చెందిన అనిల్‌ హైదరాబాద్‌లోని సిఎస్‌ఐఆర్‌, ఐఐసిటిలో డాక్టర్‌ ఎ.వెంకట్‌ నర్సయ్య పర్యవేక్షణలో పిహెచ్‌డి పూర్తిచేశారు. అనిల్‌ డాక్టరేట్‌ సాధించడం పట్ల పలువురు అభినందించారు.

Check Also

టోకెన్లు ఉన్నవారే కంట్రోల్‌ దుకాణానికి రావాలి

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల‌ ప్రకారం ఆహార భద్రత కార్డు ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *