Breaking News

29న అప్రెంటిస్‌ మేళా

నిజామాబాద్‌, ఫిబ్రవరి 27

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లాలోని ప్రభుత్వ, ప్రయివేటు ఐటిఐలలో పాసయిన విద్యార్థుకు ఈనెల‌ 29న ఉదయం 10 గంటల‌ నుంచి నిజామాబాద్‌ ప్రభుత్వ బాలుర ఐటిఐలో అప్రెంటిస్‌ మేళా నిర్వహిస్తున్నట్టు ప్రిన్సిపాల్‌ కోటిరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.

డీజిల్‌ మెకానిక్‌, మోటార్‌ మెకానిక్‌, ఫిట్టర్‌ పాసైన, ఉత్తీర్ణత పొందిన విద్యార్థులు అర్హుల‌న్నారు. విద్యార్థులు తమ ఒరిజినల్‌ సర్టిఫికెట్లతో పాటు ఒక సెట్‌ జిరాక్సు ప్రతులు తీసుకొని అప్రెంటిస్‌కు హాజరు కావాల‌ని సూచించారు.

అప్రెంటిస్ కాలంలో నెల‌కు రూ. 7 వేల‌ 700 నుంచి 8 వేల‌ 50 వరకు ఇవ్వబడుతుందని, కంపెనీ మహింద్రా, మహింద్రా జహీరాబాద్‌లో ఉంటాయని అన్నారు. కంపెనీ మేనేజర్‌ గిరిధర్‌ రావు బాక్సి జహీరాబాద్‌ నుంచి వచ్చి నిజామాబాద్‌లో అప్రెంటిస్‌ మేళా నిర్వహిస్తున్నారన్నారు. విద్యార్థులు అవకాశాన్ని వినియోగించుకోవాల‌ని కోరారు.

Check Also

ప్రతి కార్యకర్త తోచినంత సహాయం చేయాలి

నిజాంసాగర్‌, ఏప్రిల్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి డివిజన్‌ కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిని ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *