Breaking News

రైతుల‌కు అందుబాటులో ఉంటా

రెంజల్‌, ఫిబ్రవరి 27

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైతుల‌కు అందుబాటులో ఉంటూ రైతుల‌ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తానని రెంజల్‌ నూతన విండో చైర్మన్‌ అసాని ప్రశాంత్‌ అన్నారు. గురువారం మండలంలోని రెంజల్‌ సహకార సంఘం చైర్మన్‌గా ప్రశాంత్‌ బాధ్యతలు చేపట్టారు. విండో కార్యాయంలో అధికారులు, టిఆర్‌ఎస్‌ నాయకుల‌ సమక్షంలో చైర్మన్‌గా ప్రమాణం చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుల‌కు అందుబాటులో ఉంటూ రైతు అభివృద్ధికి ఎ్లవేళలా సహాయ సహకారాలు అందిస్తూ సహకార సంఘాన్ని మరింత అభివృద్ధి కోసం కృషి చేస్తానని తెలిపారు.

కార్యక్రమంలో తహసీల్దార్‌ అసాదుల్లా ఖాన్‌, ఎంపీడీఓ గోపాల‌కృష్ణ, మండల‌ టిఆర్‌ ఎస్‌ అధ్యక్ష కార్యదర్శులు భూమరెడ్డి, రవీందర్‌ గౌడ్‌, సర్పంచ్‌లు రమేష్‌, సాయరెడ్డి, బైండ్ల రాజు, వికార్‌ పాషా, కలిమ్‌ బేగ్‌, నీలా విండో చైర్మన్‌ ఇమ్రాన్‌ బేగ్‌, ఉపాధ్యక్షుడు మొహినోద్దీన్‌, టిఆర్‌ఎస్‌ నాయకులు రఫిక్‌, రాఘవేందర్‌ తదితరులు పాల్గొన్నారు.

Check Also

ప్రతి కార్యకర్త తోచినంత సహాయం చేయాలి

నిజాంసాగర్‌, ఏప్రిల్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి డివిజన్‌ కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిని ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *