Breaking News

చెట్లు నరికితే కఠిన చర్యలు

నిజామాబాద్‌, ఫిబ్రవరి 27

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : చెట్లను ఎక్కడ ధ్వంసం చేసినా కఠినంగా వ్యవహరించాల‌ని అవసరమైతే క్రిమినల్‌ కేసులు కూడా నమోదు చేయాల‌ని జిల్లా కలెక్టర్‌ నారాయణరెడ్డి సంబంధిత అధికారుల‌ను ఆదేశించారు. గురువారం సాయంత్రం కలెక్టరేట్‌ ప్రగతి భవన్‌ సమావేశ మందిరంలో జిల్లాస్థాయి అటవీ సంరక్షణ కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు.

జిల్లా అటవీ అధికారి సునీల్‌, అదనపు సిపి ఉషా విశ్వనాథ్‌ తదితర అధికారుల‌తో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కలెక్టర్లతో రాష్ట్ర ముఖ్యమంత్రి కాన్ఫరెన్స్‌ సందర్భంగా ఈ విషయమై ప్రత్యేకంగా ఆదేశాలు జారీ చేశారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న హరితహారం కార్యక్రమంలో పెద్ద ఎత్తున మొక్కలు నాటడమే కాకుండా వాటిని సంరక్షించడం కూడా నిధుల‌తో పాటు ప‌లు చర్యలు తీసుకుంటున్న విషయం అందరికి తెలిసేనని అన్నారని, కానీ విధ్వంసానికి కఠినంగా వ్యవహరించకుంటే హరితహారంలో చేసిన శ్రమంతా వృధా అవుతుందని తెలిపారని అన్నారు.

ఈ దిశగా అధికారులు ప్రత్యేక ద ృష్టి కేంద్రీకరించి అవసరమైన పకడ్బందీ చర్యలు తీసుకోవడంతోపాటు అడవిని ధ్వంసం చేసే వారిపైన చెట్లను నరికే వారిపైన అక్రమ కల‌ప రవాణా పైన కూడా చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని ఆదేశించారు. ఇందుకుగాను జిల్లాలో ఎక్కడ కూడా చెట్లను నరకకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాల‌ని, సొంత భూముల్లో పెరిగిన చెట్లను నరకడానికి కూడా వాల్టా చట్టం ప్రకారం తప్పనిసరిగా అటవీశాఖ అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు.

అనుమతి లేకుండా ఏ రకమైన కల‌ప అయినా రవాణా జరుగుతుంటే కఠినంగా చర్యులు తీసుకోవాల‌న్నారు. రెగ్యుల‌ర్‌గా అడవుల‌ను ధ్వంసం చేసే వారి విషయంలో దృష్టి పెట్టాల‌ని అదేవిధంగా సా మిల్లులో రెగ్యుల‌ర్‌గా తనిఖీలు నిర్వహించి అక్రమ కల‌ప ఉన్నట్లయితే కేసు నమోదు చేయాల‌ని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఇందుకుగాను రెవెన్యూ, పోలీస్‌, అటవీ అధికారులు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాల‌ని ఆదేశించారు.

డివిజన్‌ మండల‌ స్థాయిలో సంబంధిత అధికారుల‌తో సమావేశం ఏర్పాటు చేసి అక్రమంగా చెట్ల నరికివేత కల‌ప రవాణా తదితర చర్యలు నిరోధించాల‌ని ఆదేశించారు. అదేవిధంగా అడవుల‌ దగ్గర పంట కోసిన భూముల‌ వద్ద నిప్పు పెట్టడం వ‌ల్ల‌ అడవుల‌ దహనానికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాల‌ని ఆదేశించారు. ఇందుకుగాను అన్ని శాఖల‌ అధికారులు, ప్రజా ప్రతినిధులు, ప్రజలు ఎక్కడైనా అక్రమాలు జరుగుతుంటే వెంటనే స్పందించి నివారణ చర్యులు తీసుకోవాల‌ని అదేవిధంగా మొక్కలు కానీ చెట్లు కానీ ఎండిపోతుంటే కారణాలు తెలుసుకొని నివారించడానికి కృషి చేయాల‌న్నారు.

ప్రజల‌లో అవగాహన కల్పించడానికి అటవీశాఖ అధికారులు గోడ ప్రతులు, పాంప్లెట్స్‌ ముద్రించి ప్రజల‌కు అవగాహన కలిగేలా చర్యలు తీసుకోవాల‌న్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ చంద్రశేఖర్‌, మున్సిపల్‌ కమిషనర్‌ జితేష్‌ వి పాటిల్‌, ఆర్‌డివోలు వెంకటయ్య, శ్రీనివాస్‌, గోపిరాం, ఎఫ్‌డివో రామ్‌ కిషన్‌, సంబంధిత శాఖల‌ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Check Also

ప్రతి కార్యకర్త తోచినంత సహాయం చేయాలి

నిజాంసాగర్‌, ఏప్రిల్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి డివిజన్‌ కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిని ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *