Breaking News

ఉచిత కంటి వైద్య శిబిరం

రెంజల్‌, ఫిబ్రవరి 27

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని తాడ్‌ బిలోలి గ్రామంలో గురువారం ల‌యన్స్‌ క్లబ్‌ బోధన్‌ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత కంటి వైద్య శిబిరాన్ని సర్పంచ్ వెల్మ‌ల‌ సునీత ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ల‌యన్స్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో గ్రామంలో ఉచిత కంటి శిబిరాన్ని ఏర్పాటు చేసి రోగుల‌కు ఉచితంగా మందులు పంపిణీ చేయడం అభినదనీయమని, ఇలాంటి సేవకార్యక్రమం చేయడం ద్వారా గ్రామంలో ఉన్న పేద కుటుంబాల‌కు తోడ్పాటును అందించినవారమవుతామన్నారు. అనంతరం వైద్యురాలు శ్వేత రోగుల‌ను పరీక్షించి ఉచిత మందుల‌ను అందించారు. కార్యక్రమంలో కార్యదర్శి సాయిబాబా, మాజీ ఎంపీటీసీ నర్సయ్య, క్యాంప్‌ ఇంచార్జి హన్మంత్‌ రావ్‌, సిబ్బంది సురేష్‌, రియాజ్‌ తదితరులు పాల్గొన్నారు.

Check Also

ప్రతి కార్యకర్త తోచినంత సహాయం చేయాలి

నిజాంసాగర్‌, ఏప్రిల్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి డివిజన్‌ కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిని ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *