Breaking News

పట్టణ ప్రగతి పరిశీలించిన కలెక్టర్‌

కామారెడ్డి, ఫిబ్రవరి 28

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి మున్సిపల్‌ పరిధిలో 9, 10, 11, 16 వార్డుల‌లో జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ శరత్‌ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయా వార్డుల్లో ప్రజల‌తో సమస్యల‌ను అడిగి తెలుసుకున్నారు. 9, 10 వార్డుల‌లో రోడ్లకు ఇరువైపులా ఉన్న చెత్తాచెదారం, పిచ్చి మొక్కల‌ను తొల‌గించాల‌ని సూచించారు.

పదో వార్డులో రైస్‌ మిల్‌ సమీపంలో పిచ్చిమొక్కలు అధ్వానంగా ఉండడంతో వాటిని రైస్‌ మిల్‌ యజమానితో శుభ్రం చేయించి, పరిశుభ్రత బోర్డు ఏర్పాటు చేయాల‌ని సూచించారు. లింగాపూర్‌లో పూడిక నిండిన మురుగు కాలువల‌ను పరిశీలించారు. పూడిక మట్టిని నాలుగు రోజుల్లో పూర్తిగా తీయించాల‌ని కౌన్సిల‌ర్‌కు సూచించారు.

ఆదివారం మొక్కలు నాటే కార్యక్రమం చేపడతామని కౌన్సిల‌ర్‌ పేర్కొన్నారు. మురుగు కాలువ‌లు తీసే కూలీల‌కు 600 రూపాయలు చెల్లించాల‌ని సూచించారు. పిచ్చి మొక్కల‌ను తొల‌గించే కూలీల‌కు రూపాయలు 450 చొప్పున చెల్లించాల‌ని అన్నారు. కలెక్టర్‌ వెంట అధికారులు, కౌన్సిల‌ర్లు ఉన్నారు.

Check Also

టోకెన్లు ఉన్నవారే కంట్రోల్‌ దుకాణానికి రావాలి

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల‌ ప్రకారం ఆహార భద్రత కార్డు ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *