Breaking News

కామారెడ్డి పట్టణ ప్రగతి శూన్యం

కామారెడ్డి, ఫిబ్రవరి 28

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని క్లాసిక్‌ ఫంక్షన్‌ హల్‌లో శుక్రవారం మాజీ మంత్రి షబ్బిర్‌ అలీ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టిన పట్టణ ప్రగతి కార్యక్రమం చాలా మంచిదని, కానీ అమలు సాధ్యమేనా అనేది ప్రశ్నార్థకంగా ఉందన్నారు.

పట్టణ ప్రగతిలో అధికారులు సరిగా రావడం లేదన్న ఫిర్యాదులు వస్తున్నాయని, గతంలో నిర్వహించిన పల్లె ప్రగతి కార్యక్రమానికి ప్రభుత్వం ఒక్క రూపాయి విడుదల‌ చేయలేదని షబ్బీర్‌ విమర్శించారు. కేవలం కేంద్రం ఇచ్చిన 14 వ ఆర్థిక సంఘం నిధులు తప్ప ఒక్క రూపాయి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేదని, కేసీఆర్‌ పథకాలు శూన్యమని, పట్టణ ప్రగతి సమయంలో కామారెడ్డి మున్సిపల్‌ కమిషనర్‌ ఎక్కడికి వెళ్లారని ప్రశ్నించారు.

ఆయన లేకుండా ప్రగతి ఎలా సాధ్యం అవుతుందని, ఎవరో తిట్టారని సెల‌వుపై వెళ్లారని పత్రికలో చూశామని షబ్బీర్‌ అలీ పేర్కొన్నారు. అసలు తిట్టిన వ్యక్తి ఎవరని, ప్రగతి సమయంలో కమిషనర్‌ను కలెక్టర్‌ ఎలా రిలీవ్‌ చేశారని అన్నారు. మున్సిపాలిటీలో అవినీతి ఆగడం లేదని, టౌన్‌ ప్లానింగ్‌ అధికారి డబ్బు లేనిదే నూతన నిర్మాణాల‌కు అనుమతులు ఇవ్వడం లేదని పేర్కొన్నారు.

ఆమెపై అనేక ఫిర్యాదులు వస్తున్నాయని, వెంటనే జిల్లా కలెక్టర్‌ కల్పించుకొని సమగ్ర విచారణ చేపట్టి బాధితుల‌కు న్యాయం చేయాల‌న్నారు. ఈ విషయమై తాము కూడా హైదరాబాద్‌లో విజిలెన్స్‌ అధికారుల‌కు వివరిస్తామన్నారు. కందుల‌ కొనుగోలులో ప్రభుత్వం విఫల‌మైందని, ప్రభుత్వం 5 వేల‌ 800 ధర నిర్ణయించినా రైతుల‌ నుంచి కొనుగోలు చేయడం లేదని, మార్కెట్‌లో దళారులు 4 వేల‌ 800 కొంటున్నారని, ప్రభుత్వం దళారుల‌ను పోషిస్తుందన్నారు. శనివారం వరకు ప్రభుత్వం కొనుగోలు చేయకపోతే జిల్లాలోని మార్కెట్‌ కార్యాల‌యాల్లో ఆందోళనలు చేస్తామని షబ్బీర్‌ అలీ హెచ్చరించారు.

Check Also

టోకెన్లు ఉన్నవారే కంట్రోల్‌ దుకాణానికి రావాలి

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల‌ ప్రకారం ఆహార భద్రత కార్డు ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *