కామారెడ్డి, మార్చ్ 31 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భారతీయ జనతాపార్టీ కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు బాణాల లక్ష్మారెడ్డి మంగళవారం జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పి సమక్షంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ పిలుపు మేరకు కరొనా వ్యాప్తి నివారణకు ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు తన వంతుగా ఒక లక్ష రూపాయలు, అదేవిధంగా ప్రధాన మంత్రి సహాయ నిధికి ఒక లక్ష చొప్పున అందజేశారు. ఈ సందర్భంగా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉందని కరొనా మహమ్మారి వ్యాపించకుండా కేంద్ర ప్రభుత్వం అన్ని రకాల ...
Read More »Monthly Archives: March 2020
మార్చి నెల వేతనాలు పూర్తిగా చెల్లించాలి
కామారెడ్డి, మార్చ్ 31 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రైవేటు పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు సంబంధించిన మార్చి నెల పూర్తి వేతనాలను చెల్లించాలని టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బాలు ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలకు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మార్చి నెల 22 నుండి దేశవ్యాప్తంగా లాక్ డౌన్ చేయడం జరిగిందని కావున మార్చి నెలకు సంబంధించిన పూర్తి వేతనాలను జిల్లా వ్యాప్తంగా ఉన్న పాఠశాలల యాజమాన్యాలు ఉపాధ్యాయులకు చెల్లించాలని కోరారు. చాలా మంది ...
Read More »జివో 27 ఉపసంహరించుకోవాలి
నిజామాబాద్, మార్చ్ 31 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనవైరస్ బారి నుండి ప్రజల ప్రాణాలను కాపాడటానికి తమ ప్రాణాలను ఫణంగా పెట్టి పనిచేస్తున్న మెడికల్, మున్సిపల్, వాటర్ వర్స్క్ కార్మికులకు వారి సేవలను, త్యాగాలను గుర్తిస్తూ రెండు నెలల వేతనాలను బోనస్‌గా చెల్లించాలని కోరుతుంటే, రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ అందరితో పాటు వారి వేతనాలలో 10 శాతం కోత విధించటం శోచనీయమని ఏఐటియుసి నిజామాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి వై.ఓమయ్య అన్నారు. ఇప్పటికే తక్కువ వేతనాలకు పని చేసే ...
Read More »వలస కూలీలను ఆదుకోవాలి
కామారెడ్డి, మార్చ్ 31 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండల కేంద్రంలో ఇతర రాష్ట్రాలకు చెందిన సుమారు 400 మంది వలస కూలీలు కంటెయినర్లలో వెళ్తుండగా చెక్ పోస్ట్ వద్ద పోలీసులు పట్టుకున్నారు. ఉత్తరప్రదేశ్, బీహార్, రాజస్థాన్, మధ్యప్రదేశ్‌కు చెందిన వలస కూలీలు, బతుకుదెరువు కోసం హైదరాబాద్ వచ్చి జీవిస్తున్న కూలీలు కరోనా వైరస్ రావడం వలన అది వ్యాప్తి చెందకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ ప్రకటించడం వల్ల వీరికి ప్రభుత్వం నుండి ఏలాంటి సహాయ ...
Read More »యాచకులకు అన్నదానం
డిచ్పల్లి, మార్చ్ 31 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మన దేశంలో కరోన వైరస్ వ్యాప్తి చెందుతున్న తరుణంలో ప్రభుత్వం లాకుడౌన్ విధించింది. దీంతో రోడ్డుపై ఉన్న పేదవాళ్లకు ఎటువంటి తిండి తినడానికి దొరకని పరిస్థితి ఏర్పడిరది. ఈ విషయాన్ని గమనించిన డిచ్పల్లికి చెందిన గంగి సాయిలు అన్నం, పప్పు, వంకాయ, వాటర్ పాకెట్స్ అందజేశారు. 60 మందికి అన్నదానం చేశారు. అక్కడక్కడ రోడ్డుపైన కనిపించిన పేదవారికి, యాచకులకు అందజేశారు. అలాగే జాతీయ రహదారిపై నడిచి వచ్చే వారికి అన్నం ప్యాకేట్లు అందజేశారు. ...
Read More »చేతులెత్తి నమస్కరిస్తున్న వారం రోజులు ఇంట్లోనే ఉండండి
నిజామాబాద్, మార్చ్ 31 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కరోనా వైరస్ తదనంతర లాక్ డౌన్ చర్యలకు జిల్లా ప్రజలు సంపూర్ణంగా సహకరిస్తున్నారని అధికారుల కృషి అభినందనీయంగా ఉన్నదని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ, శాసనసభ వ్యవహారాల శాఖా మాత్యులు వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు. మంగళవారం మంత్రి కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి, సిపి కార్తికేయతో కలిసి జిల్లా అధికారులతో కరోనా వైరస్ తదనంతర చర్యలు, ధాన్యం కొనుగోలు తదితర విషయాలపై సమీక్ష నిర్వహించిన అనంతరం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. మార్చి ...
Read More »ఆత్యవసరమైతేనే బ్యాంక్‌లకు రండి
నిజాంసాగర్, మార్చ్ 31 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అత్యవసమైతేనె బ్యాంక్‌లకు రావాలని ఆంధ్రబ్యాంక్ మేనేజర్ బన్సీ లాల్ అన్నారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కరోనా దృష్ట్యా బ్యాంక్ ఖాతాదారులు ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బాంకింగ్ లాంటి సేవలు ఉపయోగించుకోవాలని తెలిపారు. బ్యాంక్‌నకు వచ్చినవారు కచ్చితంగా సామాజికదూరం పాటించాలని కోరారు. అలాగే బ్యాంకు గుమ్మం వద్ద బకెట్లో నీరు, శానిటయిజర్ ఉంచామని తెలిపారు. శానిటయిజర్తో చేతులు కడుక్కుని బ్యాంక్ లోకి రావాలని తెలిపారు. అత్యవసరం కాని పాస్‌బుక్ ప్రింటింగ్, బాలెన్సు విచారణ ...
Read More »వలస కూలీలకు రేషన్ బియ్యం నగదు పంపిణీ
నిజామాబాద్, మార్చ్ 31 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఇతర రాష్ట్రాల వలస కూలీలను ఆదుకునేందుకు ప్రభుత్వం ఆదేశాల ప్రకారం మంగళవారం నిజామాబాద్ కలెక్టరేట్ నందు అడిషనల్ కలెక్టర్ లత, అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్, మున్సిపల్ కమిషనర్ జితేష్ వి పాటిల్ వలస కూలీలకు ఒక్కొక్కరికి 12 కేజీల బియ్యం, 500 రూపాయల నగదు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆరవ డివిజన్ కార్పొరేటర్ ఉమారాణి తదితరులు పాల్గొన్నారు.
Read More »పాడి రైతు కుటుంబానికి ఇన్సూరెన్స్ చెక్కు అందజేత
నిజాంసాగర్, మార్చ్ 31 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : హెరిటేజ్ పాల సేకరణ కేంద్రంలో పాల ఉత్పత్తి చేసే ఆరేడు గ్రామానికి చెందిన రైతు గూల రమేష్ ప్రమాదవశాత్తు చెరువులో పడి చనిపోయాడు. పాడి రైతు పాల సేకరణ కేంద్రంలోని హెరిటేజ్ ఫార్మర్ వెల్ఫేర్ ట్రస్టులో సభ్యుడై ఉన్నందున రైతు ప్రమాద బీమా క్రింద నామినిగా ఉన్న అతని తల్లి గూల పద్మకు రూ. రెండు లక్షల 2 వేల 500 చెక్కును పిట్లం హెరిటేజ్ డైరీ మేనేజర్ ఆర్.సాయిలు అందజేశారు. అనంతరం ...
Read More »శనగ కొనుగోలు కేంద్రం ప్రారంభించిన మంత్రి
నిజాంసాగర్, మార్చ్ 31 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కల్హేర్ మండలంలోని బాచేపల్లి గ్రామంలో శనగ కొనుగోలు కేంద్రాన్ని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు, నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి, ఎంపీ బీబీ పాటిల్ కలిసి శనగ కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ కరోనా మహమ్మారిని ఎదుర్కోవాలంటే వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలన్నారు. ప్రజలు అత్యవసర పరిస్థితుల్లో తప్ప ఇంటి నుంచి బయటకు రావద్దని సూచించారు. దళారులను నమ్మి రైతులు ...
Read More »రైతు సమన్వయ సమితి సమావేశం
బీర్కూర్, మార్చ్ 31 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బీర్కూర్ సహకార సంఘంలో రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షుడు ద్రోణవల్లి అశోక్ ఆధ్వర్యంలో రైతు సమన్వయ సమితి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతు మొత్తం వేసిన వరి నాట్లు 3283 ఎకరాలు, వరి ధాన్యం కొనుగోలు చేసి ప్రభుత్వానికి పంపేవిధంగా చూడాలన్నారు. కార్యక్రమంలో బీర్కూర్ రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు అవారి గంగారాం, మండల వ్యవసాయ అధికారి కమల, ఏఇవో శ్రావణ్ కుమార్, సొసైటీ కార్యదర్శి మల్దొడ్డి ...
Read More »యుద్ధంలో చివరి అంకంలో ఉన్నాం- ఈ కొద్ది రోజులు ఇదే దీక్షతో పని చేస్తే విజయం మన సొంతం – కలెక్టర్
నిజామాబాద్, మార్చ్ 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కరోనా వైరస్ మహమ్మారిని మన దరిచేరనీయకుండా చేసిన యుద్ధంలో చాలా వరకు విజయం సాధించామని యుద్ధంలో గెలవడానికి చివరి అంకంలో ఉన్నామని ఈ కొద్ది రోజులు ఇదే దీక్ష పట్టుదలతో పని చేస్తే 100 శాతం విజయం మనదేనని జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి అధికారులకు ఉద్బోధించారు. సోమవారం ఉదయం క్యాంప్ కార్యాలయం నుండి కరోనా వైరస్ కట్టడికి పకడ్బందీగా విధులు నిర్వహిస్తున్న అధికారులు, ఉద్యోగులతో సెల్ కాన్ఫరెన్స్ లో మాట్లాడారు. ఒకటి-రెండు పాజిటివ్ కేసులు ...
Read More »హక్కుల గురించి అవగాహన కలిగి ఉండాలి
నిజామాబాద్, మార్చ్ 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రతి వినియోగదారుడు తమ హక్కుల గురించి అవగాహన కలిగి ఉండాలని జిల్లా వినియోగదారుల ఫోరం చైర్మెన్ జయశ్రీ అన్నారు. కొత్తగా వచ్చిన వినియోగదారుల హక్కు చట్టం 2019 వినియోగదారులు మోసపోకుండా రక్షిస్తుందన్నారు. వినియోగదారుల హక్కుల చట్టం 2019 గురించి ప్రజలకు అవగాహన కల్పించేందుకు గౌతమి వినియోగదారుల సంఘం కరపత్రాలు ముద్రించగా వాటిని శుక్రవారం నిజామాబాదులో వినియోగదారుల ఫోరం చైర్మెన్ జయశ్రీ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కొత్తగా వచ్చిన వినియోగదారుల చట్టం ...
Read More »అంగన్వాడిలో పోషణ్ అభియాన్
ఆర్మూర్, మార్చ్ 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణం హౌసింగ్ బోర్డు కాలనీలోని అంగన్వాడి సెంటర్లో శుక్రవారం పొషన్ అభియాన్, పోషన్ పక్షమ్ కార్యక్రమం ఏర్పాటు చేశారు. దీనిలో భాగంగా మహిళలకు పోషణ విలువలతో కూడిన వంటల పోటీలను నిర్వహించారు. వంట పోటీల్లో మొదటి స్థానంలో ఉన్న బొడ్డు సుమలతకు సెంటర్ టీచర్ అందె పుష్పలత బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో కాలనీ మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
Read More »జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు
కామారెడ్డి, మార్చ్ 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జుక్కల్‌లోని 30 పడకల ఆసుపత్రి పనులను జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ శుక్రవారం పరిశీలించారు. స్థానికులను 30 పడకల ఆసుపత్రి ఏర్పాటు చేయడం వల్ల కలిగే ప్రయోజనాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం హరితహారం పథకం కింద మండల కేంద్రంలో నాటిన మొక్కలను పరిశీలించారు. పాలశీతలీకరణ కేంద్రాన్ని తనిఖీ చేశారు. ప్రభుత్వ కార్యాలయాలను పరిశీలించి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని అధికారులకు సూచించారు.
Read More »కొనుగోలు కేంద్రాలు పరిశీలించిన కలెక్టర్
కామారెడ్డి, మార్చ్ 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జుక్కల్ మద్నూర్లోని కొనుగోలు కేంద్రాలను జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ శుక్రవారం తనిఖీ చేశారు. కందుల కొనుగోలు కేంద్రంలో దళారులు విక్రయిస్తున్నారని రైతులు కలెక్టర్ దృష్టికి తెచ్చారు. వ్యవసాయ శాఖ అధికారులు రైతుల ఇంటికి వెళ్లి వివరాలు సేకరించి నిల్వ ఉన్న రైతులకు అనుమతి పత్రాలు ఇవ్వాలని సూచించారు. దళారులకు అనుమతి పత్రాలు ఇస్తే వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. రైతుకు అవసరం మేరకు టార్పాలిన్ కవర్లను అందజేయాలని, మార్కెట్ ...
Read More »పెళ్ళి పందిట్లోనే కళ్యాణక్ష్మి
కామారెడ్డి, మార్చ్ 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని వాంబే కాలనీకి చెందిన మర్కంటి లక్ష్మి కూతురు మార్కంటి దీపిక వివాహం సందర్భంగా పెళ్లి కూతురు తల్లి మర్కంటీ లక్ష్మికి లక్షా నూటపదహారు రూపాయల కల్యాణక్ష్మి చెక్కును మున్సిపల్ చైర్ పర్సన్ జాహ్నవి, కామారెడ్డి ఎంపిపి అధ్యక్షులు పిప్పిరీ ఆంజనేయులు అందజేశారు. ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్‌కు అసెంబ్లీ సమావేశాలు ఉన్నందున ఆయన ఆదేశాల మేరకు స్థానిక ప్రజాప్రతినిధులు అందజేశారు. ఆత్మ మాజీ చెర్మెన్ బలవంతరావు తదితరులు ఉన్నారు.
Read More »ఎన్నికకు అన్ని చర్యలు తీసుకోవాలి
నిజామాబాద్, మార్చ్ 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు ఎక్కడ కూడా కోడ్ ఉల్లంఘన జరగకుండా మండల స్థాయి అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్లో ఎన్ఐసీ నుండి మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఉప ఎన్నిక, హరితహారం, టెన్త్ పరీక్షలు, శిక్షణ సివిల్ సర్వీస్ అధికారుల పర్యటన, తదితర అంశాలపై ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉప ఎన్నిక ...
Read More »అక్రమంగా నిల్వ ఉంచిన బియ్యం పట్టివేత
ఆర్మూర్, మార్చ్ 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా బాల్కొండ గ్రామంలోని ఓ ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన ప్రభుత్వ ప్రజాపంపిణీ బియ్యాన్ని అధికారులు గుర్తించారు. విశ్వసనీయ సమాచారం మేరకు శుక్రవారం ఓ ఇంటిలోని షెటర్లో అక్రమముగా నిల్వ ఉంచిన బియ్యాన్ని రాష్ట్ర టాస్క్ ఫోర్స్ టీం, ఎన్ఫోర్సుమెంట్ డిప్యూటి తహసీల్దార్ వెళ్లి చూడగా 81 ప్లాస్టిక్ బస్తాలు వివిద సైజులలో ఉండడాన్ని గుర్తించారు. వాటి పరిమాణం 39.55 క్వింటాలు కలవని, వీటి విలువ రూ.79 వేల 100 ఉంటుందన్నారు. ...
Read More »17న అసెంబ్లీ ముట్టడి
ఆర్మూర్, మార్చ్ 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఉద్యోగ నోటిఫికేషన్లకై ఈనెల 17న అసెంబ్లీ ముట్టడి విజయవంతం చేయాలని పివైఎల్ డివిజన్ ప్రధాన కార్యదర్శి నిమ్మ నిఖిల్ అన్నారు. ఈ మేరకు శుక్రవారం పివైఎల్ ఆర్మూర్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో కుమార్ నారాయణ భవన్లో శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఆరేళ్ళు గడుస్తున్నా నిరుద్యోగులకు నిరాశే మిగిలిందన్నారు. లక్షపోస్టులు ఖాళీగా ఉన్నా ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేయక పోవడం సిగ్గుచేటన్నారు. తక్షణం ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయాలని, నిరుద్యోగులకు ...
Read More »