నిజామాబాద్, మార్చ్ 10
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు, రచయిత సావిత్రి బాయి పూలే 123 వ వర్ధంతి సందర్భంగా ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పిడిఎస్యు) నాయకులు నగరంలోని అంబేద్కర్ కాలనీలో గల సావిత్రిబాయి పూలే విగ్రహానికి పూలమాలవేసి నివాళుర్పించారు. ఈ సందర్భంగా పిడిఎస్యు జిల్లా అధ్యక్షురాలు కల్పన మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే జీవితం మహిళలకు, విద్యార్థులకు స్ఫూర్తిదాయకమన్నారు.
మనువాదం, పితృస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడి మహిళల కోసమే విద్యా సంస్థలు నెలకొల్పడం గొప్ప విషయమన్నారు. కుల వ్యవస్థకు, స్త్రీల మీద వివక్షకు వ్యతిరేకంగా సావిత్రి పూలే పోరాటం ఆచరణీయ మన్నారు. సావిత్రిబాయి జీవితం నేటితరం మహిళాలోకానికి ఆదర్శం అన్నారు.
ఆమె ఆశయా సాధనలో పని చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పిడిఎస్యు జిల్లా నాయకులు ప్రత్యూష, అశ్రుద్దీన్, సాయితేజ, రమేష్ చారి, మహిపాల్, రమేష్, నరేష్, రాహుల్, శ్రీకాంత్, దినేష్ తదితరులు పాల్గొన్నారు.

Nizamabad News

Latest posts by Nizamabad News (see all)
- కరోన సమయంలో రక్తదానం చేయడం అభినందనీయం - April 15, 2021
- 15 మందికి పాజిటివ్ - April 15, 2021
- సుస్థిర రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ - April 14, 2021