Breaking News

Daily Archives: April 1, 2020

వల‌స కూలీల‌కు ప్రభుత్వం అండగా ఉంటుంది

కామారెడ్డి, ఏప్రిల్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వల‌స కూలీల‌కు ప్రభుత్వంతో పాటు పలు స్వచ్ఛంద సంస్థలు అండగా ఉంటాయని ప్రభుత్వ విప్‌, కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌ అన్నారు. బుధవారం మండల‌ కేంద్రంలోని గురుకుల‌ పాఠశాల‌లో ఉన్న 350 మంది వల‌స కూలీల‌కు ఆయన భోజనాలు అందించారు. ఈ సందర్భంగా కూలీల‌తో మాట్లాడుతూ దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌ ప్రభావం తీవ్రంగా ఉన్నందున ఎవరు కూడా రోడ్లపై వెళ్లే పరిస్థితి లేదని సూచించారు. పదిహేను రోజుల‌ పాటు ఇక్కడే ఉండి తాము ...

Read More »

18 వేల‌ ఇళ్లలో సర్వే పూర్తి

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కొందరు వ్యక్తులు ఢల్లీి వెళ్లి రావడంతో వారిలో ఒకరికి కరోనా వైరస్‌ పాజిటివ్‌ రావడంతో ఢల్లీి వెళ్లి వచ్చిన వారు తిరిగిన ప్రాంతాల్లో ఇప్పటికీ 18 వే ఇళ్లల్లో సర్వే పూర్తి చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్‌ నారాయణరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. బుధవారం ఆయన ఒక ప్రకటన విడుదల‌ చేస్తూ పట్టణంలో ఖిల్లా, మాల‌పల్లి ఆటోనగర్‌, తదితర చుట్టుపక్కల‌ ప్రాంతాల్లో వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది, పోలీస్‌, మున్సిపల్‌ తదితర శాఖల‌ ...

Read More »

హసన్‌పల్లిలో రేషన్‌ బియ్యం పంపిణీ

నిజాంసాగర్‌, ఏప్రిల్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ మండలంలోని హసన్‌ పల్లి గ్రామంలో ప్రతి రేషన్‌ కార్డుకు ఒక వ్యక్తికి 12 కిలో బియ్యాన్ని పంపిణీ చేయడం జరుగుతుందని పంచాయతీ కార్యదర్శి రవికుమార్‌ రాథోడ్‌, రేషన్ డీల‌ర్‌ ఆగయ్య తెలిపారు. రేషన్‌ షాప్‌కు వచ్చే వారు ప్రతి ఒక్కరు ఒక మీటరు దూరం పాటించి రేషన్‌ బియ్యాన్ని తీసుకెళ్ళాల‌ని సూచించారు. ప్రజలు ఎవరూ కూడా ఇంటి నుంచి బయటకు రాకూడదన్నారు. ప్రజలు అత్యవసర పరిస్థితుల్లోనే బయటకు రావాల‌న్నారు. రేషన్‌ షాప్‌కి ...

Read More »

క్వారంటైన్‌ సెంటర్ల తనిఖీ

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మాక్లూర్‌, డిచ్‌పల్లిలో గల‌ ప్రభుత్వ క్వారంటైన్‌ సెంటర్లను సందర్శించిన జిల్లా కలెక్టర్‌ నారాయణరెడ్డి వారితో మాట్లాడారు. వారికి ఎలాంటి ఇబ్బందులు ఉన్నా తాహసిల్దార్‌కు లేదా నేరుగా తనకు తెలియచేయాల‌న్నారు. క్వారంటైన్‌లో ఉన్నవారితో ఆయన మాట్లాడుతూ ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయని అడిగి తెలుసుకున్నారు. అందుకు వారు ఇంటి దగ్గర కన్నా చాలా బాగున్నవి అని తెలియజేశారు. 14 రోజులు పూర్తయిన వారిని వైద్యపరీక్షల‌ అనంతరం కరోనా ల‌క్షణాలు లేని వారిని డిశ్చార్జి చేయాల‌ని ...

Read More »

కరోనా నిర్మూల‌నకు వీధుల్లో బ్లీచింగ్‌ స్ప్రే

కామారెడ్డి, ఏప్రిల్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని 17వ వార్డులో మాజీ కౌన్సిల‌ర్ జూలూరి సుదాకర్‌ ఆద్వర్యంలో కరోనా వైరస్‌ నిర్మూల‌న కొరకు బ్లీచింగ్‌ పౌడర్‌ లిక్విడ్‌ను పిచికారి చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్‌ను ప్రతి ఒక్కరు పాటించి ఇంట్లోనే ఉండాల‌ని సూచించారు. కార్యక్రమంలో మునిసిపల్‌ ఛైర్మన్‌ నిట్టు జాహ్నవి, వైస్‌ ఛైర్మన్‌ గడ్డం ఇందుప్రియ చంద్రశేఖర్‌ రెడ్డి, వార్డు వాసులు వినోద్‌, పైడి నవీన్‌, సంజీవరెడ్డి, ...

Read More »

శనగ కొనుగోలు కేంద్రం ప్రారంభం

గాంధారి, ఏప్రిల్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గాంధారి మండల‌ కేంద్రంలో శనగ కొనుగోలు కేంద్రాన్ని బుధవారం ప్రారంభించారు. స్థానిక జూనియర్‌ కాలేజీ మైదాన ఆవరణలో డీసీఎంఎస్‌ ద్వారా శనగల‌ను కొనుగోలు చేస్తున్నట్లు డీసీఎంఎస్‌ జిల్లా డైరెక్టర్‌, స్థానిక సొసైటీ చైర్మన్‌ సాయికుమార్‌ తెలిపారు. రైతులు కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాల‌న్నారు. జిల్లా మార్కెటింగ్‌ సొసైటీ ద్వారా కొనుగోలు చేయడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చిందన్నారు. ప్రభుత్వం శనగకు మద్దతు ధరను క్వింటాలుకు రూ. 4875 నిర్ణయించిందని తెలిపారు. రైతులు దళారుల‌ను నమ్మి ...

Read More »

ముజీబ్‌ కుటుంబ సభ్యుల్లో ఒకరికి పాజిటివ్‌

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : డిల్లీ వెళ్లి వచ్చిన షేక్‌ ముజీబ్‌ కుటుంబ సభ్యుల‌లో ఒకరికి కరోనా వైరస్‌ పాజిటివ్‌ వచ్చినట్లు జిల్లా కలెక్టర్‌ నారాయణరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. బుధవారం కలెక్టర్‌ ఒక ప్రకటనలో వివరిస్తూ, ఢల్లీి వెళ్లి వచ్చిన షేక్‌ ముజీబ్‌కు పరీక్ష ద్వారా ఆయనకు కరోనా వైరస్‌ వ్యాప్తి చెందినట్లు అందరికీ తెలిసిన విషయమే. ఈ నేపథ్యంలో ఆయన కుటుంబ సభ్యుల‌కు పరీక్షలు నిర్వహించగా ఒకరికి పాజిటివ్‌ వచ్చినట్లు నివేదికల‌ ద్వారా తెలిసిందన్నారు. కుటుంబ ...

Read More »

కామారెడ్డిలో ముగ్గురికి కరోనా పాజిటివ్‌

కామారెడ్డి, ఏప్రిల్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లాలో ముగ్గురికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయినట్లు కామారెడ్డి జిల్లా వైద్య ఆరోగ్య అధికారి చంద్రశేఖర్‌ తెలిపారు. దేవునిపల్లికి చెందిన మ‌ల్ల‌య్య, బాన్సువాడకు చెందిన సయ్యద్‌ నయీమ్‌, అబ్దుల్‌ షాకూర్‌కు నిర్ధారణ అయినట్లు చెప్పారు. బాన్సువాడలో ఇంటింట సర్వే వైద్య సిబ్బందితో నిర్వహిస్తామని చెప్పారు. ప్రజలు ఆందోళన చెందవద్దని సూచించారు. రెండు పట్టణాల్లో పారిశుద్ధ్య పనుల‌ను ముమ్మరంగా కొనసాగిస్తామని పేర్కొన్నారు. ప్రజలు ఇళ్లకే పరిమితం కావాల‌ని సూచించారు. బాన్సువాడకు చెందిన ఇద్దరు ...

Read More »