కామారెడ్డి, ఏప్రిల్ 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి పట్టణంలోని 15వ వార్డులో కౌన్సిలర్ వనిత రామ్మోహన్, మాజీ కౌన్సిలర్ రామ్మోహన్ ఆధ్వర్యంలో సోడియం హైపో క్లోరైడ్ రసాయనాన్ని వీధులలో పిచికారి చేయించారు. 5 వేల లీటర్ల రసాయనంతో వార్డులోని వీదులన్ని శానిటైజ్ చేయబడ్డాయని పేర్కొన్నారు. కరోనా బారిన పడకుండా ఉండాలంటే అందరు సామాజిక దూరం పాటించాలని, ఇంట్లోనే ఉండాలని రామ్మోహన్ సూచించారు. వార్డు ప్రజలకు ఎలాంటి అత్యవసరమున్నా తనకు ఫోన్ చేయాలని, అందుకు తగిన ఏర్పాట్లు చేస్తానని, ఎవరు కూడా ...
Read More »Daily Archives: April 5, 2020
కోవిడ్ -19 ఆసుపత్రిగా జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి
నిజామాబాద్, ఏప్రిల్ 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని కోవిడ్-19 ఆసుపత్రిగా మార్చటానికి చర్యలు అవసరమైన ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ సి . నారాయణ రెడ్డి అధికారులను ఆదేశించారు. కలెక్టర్ తన క్యాంపు కార్యాలయంలో ఆదివారం డిఎం హెచ్ఓ, ఆసుపత్రి సూపరింటెండెంట్, మెడికల్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కరోనా కేసులు పెరుగనున్న దృష్ట్యా ఆసుపత్రిలో 500 బెడ్స్‌కు ప్లాన్ చేసుకొని సిబ్బందిని సిద్ధం చేసుకోవాలన్నారు. ప్రణాళిక సిద్ధం చేసుకుని ఆసుపత్రిని పూర్తిగా ...
Read More »కంటేయిన్మెంట్ ప్రాంతాల్లో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి
నిజామాబాద్, ఏప్రిల్ 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కరోనా వైరస్ కేసు వచ్చిన ప్రాంతాలలో కంటేయిన్మెంట్గా ప్రకటించే చోట అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ఆదివారం ఆయన హైదరాబాదు నుండి జిల్లా కలెక్టర్లతో కరోనా వైరస్ పట్ల తీసుకుంటున్న చర్యలపై వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ ప్రాంతాలను ప్రత్యేక జాగ్రత్తతో చర్యలు తీసుకోవాలని, అక్కడి ప్రజల నమూనా సేకరణ పూర్తిస్థాయిలో జరగాలని, ఈ ప్రాంతాలలో ఎవరు ...
Read More »పది కాదు ఎనిమిది
కామారెడ్డి, ఏప్రిల్ 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లాలో ఇప్పటి వరకు మొత్తం 10 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్టు కొన్ని పత్రికలలో వస్తున్న విషయం అవాస్తవమని, కామారెడ్డి జిల్లాలో ఇప్పటివరకు తెంగాణ ప్రభుత్వం దృవీకరించినవి, ప్రతిపాదిత పరీక్షా కేంద్రాలలో నిర్దారించినవి 8 పాజిటివ్ కేసులుగా గుర్తించబడినట్టు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి చంద్రశేఖర్ ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రస్థాయిలో వచ్చిన జాబితాలో కొన్ని పేర్లు రెండు సార్లు ప్రింట్ కావడంతో 8కి బదులుగా 10 పాజిటివ్ కేసులుగా ...
Read More »ఆరుగురు వైద్యుల రాజీనామా – తిరిగి విధుల్లోకి
కామారెడ్డి, ఏప్రిల్ 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా ఆస్పత్రిలో పనిచేస్తున్న ఆరుగురు వైద్యులు శనివారం రాజీనామా చేశారు. ఆదివారం వైద్యులతో జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి వైద్యులకు నచ్చజెప్పి తిరిగి విధుల్లో చేరే విధంగా ఒప్పించారు. ఓపి సామాజిక దూరం పాటించే విధంగా చూడాలని వైద్యులు కలెక్టర్ దృష్టికి తెచ్చారు. సామాజిక దూరం పాటించే విధంగా చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్, సూపరింటెండెంట్ అంగీకరించారు. వైద్యులు రాజీ నామాను వెనక్కి తీసుకొని విధుల్లో చేరనున్నట్లు ...
Read More »అన్నిదానాలలో కెల్లా రక్తదానం గొప్పది
కామారెడ్డి, ఏప్రిల్ 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : లింగంపెట్ మండలం పరమల్ల గ్రామానికి చెందిన లత (28) అనే గర్భిణీకి కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాలలో ఆపరేషన్ నిమిత్తమై అత్యవసరంగా బి పాజిటివ్ రక్తం అవసరం ఏర్పడిరది. కాగా సదరు గర్భిణి బంధువులు కామారెడ్డి రక్తదాతల సమూహాన్ని సంప్రదించారు. వెంటనే స్పందించి కామారెడ్డి పట్టణానికి చెందిన గణేష్ సహకారంతో బి పాజిటివ్ రక్తాన్ని వి టి ఠాకూర్ బ్లడ్ బ్యాంక్‌లో అందించి ప్రాణాలు కాపాడడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా రక్తదాతకు ...
Read More »మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ 113 వ జయంతి
నిజామాబాద్, ఏప్రిల్ 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ 113 వ జయంతిని జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో నిర్వహించారు. ఆదివారం బాబు జగ్జీవన్‌రామ్ 113వ జయంతి సందర్భంగా ప్రగతి భవన్ సమావేశ మందిరంలో కొద్దిమంది అధికారుల సమక్షంలో జయంతి ఉత్సవాన్ని నిర్వహించారు. కరోనా వైరస్ నేపథ్యంలో సభలు సమావేశాలు నిర్వహించకుండా అభిమానులు వారి నాయకుల జయంతి వేడుకలను ఇంట్లోనే ఉండి నివాళులు అర్పించాలని ప్రభుత్వం ఆదేశించినందున కార్యక్రమాన్ని ప్రజలతో జరుపబడలేదు. ప్రగతి భవన్లో నిర్వహించిన ...
Read More »కల్లు ప్రియుల ఆందోళన
నందిపేట్, ఏప్రిల్ 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కల్లుకు బానిసైన బాదితుల అలవాటును ఆసరా చేసుకొని నందిపేట మండలంలోని కొన్ని గ్రామాలలో కొందరు ముస్తేధార్లు అడ్డగోలుగా రసాయన పదార్థాలతో, ద్రావణాలతో తయారుచేసి విక్రయిస్తున్నారని కల్లు ప్రియులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తయారుచేసే విధానం విడిచి ఎలా తయారు చేసినా తాగుతారనే ధీమాతో ఇష్టారాజ్యంగా కల్లును కల్తీ చేయడంతో మురుగు వాసన వస్తోందని, గొంతు నొప్పి వస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వైన్స్ లో ప్రభుత్వం చీఫ్ లిక్కర్స్ ప్రవేశ పెట్టడంతో 70 ...
Read More »