Breaking News

వల‌స కూలీల‌కు అన్నదానం

కామారెడ్డి, ఏప్రిల్‌ 6

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి ప్రొఫెషనల్‌ ఫోటో అండ్‌ వీడియో గ్రాఫర్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో సోమవారం భిక్కనూరు మండల‌ కేంద్రంలో గల‌ రెసిడెన్షియల్‌ వసతి గృహంలో బీహార్‌, మధ్య ప్రదేశ్‌, ఉత్తర ప్రదేశ్‌ రాష్ట్రాల‌ దినసరి కూలీల‌కు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. సుమారు 300 మందికి అన్నదానం చేశారు.

కార్యక్రమంలో కామారెడ్డి డిఎస్‌పి, భిక్కనూరు సిఐ, ఎస్‌ఐ, ఆర్‌డివో, రెవెన్యూ అధికారులు, గ్రామ పెద్దలు, యూనియన్‌ అధ్యక్షుడు అసం శ్రీనివాస్‌, ఉపాధ్యక్షుడు, కంకణాల‌ సంగమేశ్వర్‌, సెక్రటరీ జి.సంతోష్‌, కోశాధికారి దుస ఆంజనేయులు, జాయింట్‌ సెక్రటరీ అబ్దుల్‌ షఫీ, గోపి పిఆర్‌వో పందిరి శ్రీనివాస్‌, కమిటీ సభ్యులు శమీర్‌, రమేష్‌, రాజు, సంతోష్‌ రెడ్డి, భిక్కనూర్‌ యూనియన్‌ కమిటీ సభ్యులు భిక్షపతి, విజయ్‌ , సిద్దరాములు, వికాస్‌, శ్రీనివాస్‌ సభ్యులు పాల్గొన్నారు.

Check Also

రక్తదానం చేసి ప్రాణాలు కాపాడిన ప్రధానోపాధ్యాయుడు

కామారెడ్డి, మే 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆరేపల్లి గ్రామానికి చెందిన నవిత అనే 22 సంవత్సరాల‌ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *