Breaking News

లాక్‌ డౌన్‌ ఎత్తేస్తే ఏమైతది…

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 6

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రస్తుత పరిస్థితుల్లో లాక్‌డౌన్‌ ఎత్తేస్తే మళ్లీ ఆగమవుతామని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. లాక్‌డౌన్‌ ఎంత గట్టిగా పాటిస్తే అంత మంచిది అని సీఎం తెలిపారు. సోమవారం రాత్రి మీడియాతో మాట్లాడారు. ఇండియాలో జూన్‌ 3 వరకు లాక్‌డౌన్‌ పాటించాల‌ని బోస్టన్‌ కన్సల్టింగ్‌ గ్రూప్‌ చెప్పిందని సీఎం గుర్తు చేశారు.

మన దేశానికి లాక్‌డౌన్‌ తప్ప వేరే మార్గం లేదని సిఎం తేల్చిచెప్పారు. లాక్‌డౌన్ వ‌ల్ల‌ ఆర్థికంగా నష్టపోక తప్పదని అన్నారు. మన రాష్ట్రానికి రోజుకు రూ.400 నుంచి రూ.430 కోట్ల ఆదాయం వస్తుంది. లాక్‌డౌన్ మూలంగా కేవలం రూ. 6 కోట్లు మాత్రమే వచ్చాయన్నారు. ప్రజల‌ను బతికించుకోవాలంటే లాక్‌డౌన్‌ తప్ప వేరే మార్గం లేదని, ఒక వేళ లాక్‌డౌన్‌ సడలిస్తే పరిస్థితి ఏంటి? అని సీఎం ప్రశ్నించారు.

మళ్లీ గుంపులు గుంపులుగా రోడ్ల మీదకి వస్తే ఎవరు జవాబుదారీ అని సీఎం అడిగారు. లాక్‌డౌన్‌ సడలించడమంటే అంత ఆషామాషీ కాదని, ప్రధానితో రోజుకు రెండుసార్లు మాట్లాడిన సందర్భాలు ఉన్నాయన్నారు. లాక్‌డౌన్‌ను కొనసాగించాల్సిందేనని ప్రధానికి చెప్పానని, ఇది ప్రపంచానికి వచ్చిన పీడ, ఒక్క కుటుంబానికో, జాతికో రాలేదని పేర్కొన్నారు. 22 దేశాలు పూర్తిగా 100 శాతం లాక్‌డౌన్‌ చేశాయని, జపాన్‌, సింగపూర్‌, యూకే, ఫ్రాన్స్‌, జర్మనీ, కొంబియా, అర్జెంటీనా, నేపాల్‌తో పాటు మరికొన్ని దేశాలు మన పద్ధతిలోనే లాక్‌డౌన్‌ చేశాయన్నారు.

మరో 90 దేశాలు పాక్షికంగా లాక్‌డౌన్‌ చేశారని, మన రాష్ట్రం మంచి నిర్ణయం తీసుకుందన్నారు. తెలంగాణ సమాజాన్ని బతికించుకున్నామంటే లాక్‌డౌన్‌, స్వీయ నియంత్రణ వల్లే అయిందని సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు. ఇవాళ న్యూయార్క్‌ను చూస్తే శవాల‌ గుట్టలే కనిపిస్తున్నాయని, అలాంటి దుఖం ఎవరికి సంభవించకూడదన్నారు. మనమైతే ఆగమయ్యేవాళ్లం. లాక్‌డౌన్ వ‌ల్ల‌నే పరిస్థితిని కంట్రోల్‌ చేశాం అని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు.

Check Also

బసవేశ్వరుని బోధనలు ఆచరణీయం

సంగారెడ్డి, ఏప్రిల్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆదివారం జహీరాబాద్‌ ఎంపీ బి.బి పాటిల్‌, ఆర్ధిక శాఖ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *