Breaking News

అధికారుల‌తో జిల్లా కలెక్టర్‌ సమీక్ష

కామారెడ్డి, ఏప్రిల్‌ 7

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎల్లారెడ్డిలో మండలాల‌ వారీగా ఉచిత బియ్యం పంపిణీ వివరాల‌ను కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ శరత్‌ అధికారుల‌ను అడిగి తెలుసుకున్నారు. అన్ని మండలాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాల‌ను ముమ్మరంగా చేపట్టాల‌ని అధికారుల‌ను ఆదేశించారు.

ఎల్లారెడ్డి ఆదర్శ పాఠశాల‌లో ఉన్న ప్రభుత్వ కార్వంటైన్‌ను పరిశీలించారు. మాజీ ఎమ్మెల్యే జనార్దన్‌ గౌడ్‌ ముఖ్యమంత్రి సహాయనిధికి మూడు ల‌క్షల‌ చెక్కును జిల్లా కలెక్టర్‌ శరత్‌కు అందజేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే సురేందర్‌, ఆర్డీవో దేవేందర్‌, తహసిల్దార్‌ స్వామి, మున్సిపల్‌ చైర్మన్‌ సత్యనారాయణ, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Check Also

రైతులు లాభసాటి పంట వైపు మొగ్గు చూపాలి

కామారెడ్డి, మే 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి కలెక్టరేట్‌లో కోవిడ్‌-19, ధాన్యం సేకరణ, సమగ్ర వ్యవసాయ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *