Breaking News

30వ తేదీ వరకు నిత్యవసర వస్తువుల‌ కొరత లేదు

కామారెడ్డి, ఏప్రిల్‌ 8

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలో నిత్యావసర వస్తువుల‌కు కొరత లేదని కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ శరత్‌ అన్నారు. బుధవారం కలెక్టర్‌ కార్యాల‌యంలో చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ఆధ్వర్యంలో నిత్యావసర వస్తువుల ల‌భ్యతపై సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.

ఏప్రిల్‌ 30 వరకు జిల్లాలో నిత్యావసర వస్తువుల‌కు కొరత లేదని స్పష్టం చేశారు. వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టిస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌లు యాదిరెడ్డి, వెంకటేష్‌ దోతురే, అసిస్టెంట్‌ కలెక్టర్‌ తేజస్‌ నందలాల్‌ పవర్‌, చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అధ్యక్షుడు గజవాడ రవి, వ్యాపారులు పాల్గొన్నారు.

Check Also

రక్తదానం చేసి ప్రాణాలు కాపాడిన ప్రధానోపాధ్యాయుడు

కామారెడ్డి, మే 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆరేపల్లి గ్రామానికి చెందిన నవిత అనే 22 సంవత్సరాల‌ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *