Breaking News

ధైర్యంగా పని చేయండి

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 8

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కరోనా వైరస్‌ నివారణలో వైద్య ఆరోగ్య శాఖ, పోలీస్‌ శాఖ ఉద్యోగుల సేవ‌లు వెకట్టలేనివని, ధైర్యంగా పనిచేయాల‌ని జిల్లా కలెక్టర్‌ నారాయణరెడ్డి తెలిపారు. బుధవారం ఆయన కంటేయిన్మెంట్‌ కొనసాగుతున్న అహ్మదిపుర కాల‌ని, మాపల్లి తదితర 55, 56 డివిజన్‌లో పర్యటించి వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న సర్వే పరిశీలించారు. సర్వే కొనసాగుతున్న విధానాన్ని ఆశా వర్కర్‌ల‌ను అడిగి తెలుసుకున్నారు.

ఏమైనా సమస్యలు ఎదురవువుతున్నాయా అని వారిని అడిగారు. సాఫీగా కొనసాగుతుందని ప్రజలు సహకరిస్తున్నారని ప్రస్తుతానికి సమస్యలేమీ లేవని వారు కలెక్టర్‌కు వివరించారు. సిబ్బందికి అవసరమైన రక్షణ చర్యలు జిల్లా యంత్రాంగం తీసుకున్నదని సమస్యలు ఉంటే అధికారుల‌ దృష్టికి తీసుకురావాల‌ని ఎవరు కూడా భయపడవల‌సిన అవసరం లేదని అయితే కరోనా సోకకుండా జాగ్రత్తలు తీసుకోవాల‌న్నారు.

ఆ ప్రాంతాల్లో డ్రోన్‌ కెమెరాల‌ ద్వారా రసాయన ద్రావణాన్ని పిచికారి చేస్తున్న విధానాన్ని మున్సిపల్‌ కమిషనర్‌ జితేష్‌ వివి పాటిల్‌తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా సిబ్బందితో మాట్లాడుతూ అన్ని ప్రాంతాలో రసాయన ద్రావణం పిచికారి చేయాల‌ని తద్వారా ఎక్కడైనా కరోనా వైరస్‌ ఉంటే ఇన్ఫెక్షన్‌ రాకుండా ఉంటుందన్నారు. కార్యక్రమంలో ఎంహెచ్‌వో శ్రీనివాస్‌, డిఈఈ రషీద్‌ తదితరులు పాల్గొన్నారు.

Check Also

కోడ్ ఉల్లంఘించారు

నిజామాబాద్‌, మే 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో స్థానిక సంస్థల‌ ఎమ్మెల్సీ ఎన్నికల‌ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *