నిజామాబాద్, ఏప్రిల్ 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కరోనా నేపథ్యంలో విధించిన లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించి చట్టవిరుద్దంగా రోడ్లపై తిరుగుతున్న మొత్తం 934 వాహనాలు సీజ్ చేసి కేసు నమోదు చేయడం జరిగిందని నిజామాబాద్ పోలీసు కమీషనర్ కార్తికేయ తెలిపారు. సీజ్ చేసిన వాటిలో ద్విచక్ర వాహనాలు, ఆటోలు, ఫోర్ వీలర్స్ ఉన్నాయన్నారు. లాక్డౌన్ పరిశీలించేందుకు మంగళవారం కమీషనరేట్ పరిధిలో ఆయా ప్రాంతాల్లో పర్యటించారు. కరోనా వ్యాప్తి చెందుతున్న ప్రస్తుత పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయని, ప్రజలందరు స్వీయ నిర్బంధంలో ఉంటూ సహకరించాలని ...
Read More »Daily Archives: April 21, 2020
ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బందికి కరోన నెగటివ్
నిజామాబాద్, ఏప్రిల్ 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రభుత్వ ఆసుపత్రిలో పని చేస్తున్న సిబ్బందికి సంబంధించి 35 మంది నమూనాలను కరోనా వైరస్ పరీక్షకై పంపించగా అవన్నీ కూడా నెగిటివ్ వచ్చినట్లు జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.
Read More »ప్రజలు వచ్చే అన్ని ప్రదేశాల్లో కరోనా జాగ్రత్తలు తీసుకోవాలి
నిజామాబాద్, ఏప్రిల్ 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ధాన్యం కొనుగోలు కేంద్రాలకు ధాన్యాన్ని తీసుకొచ్చే రైతులకు, అదేవిధంగా పలు నిత్యవసర సరుకుల అవసరాల నిమిత్తం వచ్చే ప్రదేశాలలో కరోనా వైరస్ నిరోధానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని నిజామాబాద్ జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. కొనుగోలు కేంద్రాల వద్దకు రైతులు ధాన్యాన్ని తీసుకొస్తారని, అదేవిధంగా కూలీలు ఉపాధి హామీ పథకం పనులలో హాజరు కావడానికి వస్తారని, వ్యవసాయ పనులు కొనసాగుతూ ఉంటాయని ప్రజలు ప్రతి రోజు నిత్యావసరాలకు, కూరగాయలకు, మాంసం ...
Read More »తెలంగాణలో 928 కి చేరిన కరోనా పాజిటివ్ కేసులు
హైదరాబాద్, ఏప్రిల్ 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ తెలంగాణలో తన ప్రతాపాన్ని చూపిస్తుంది. తెలంగాణ ప్రభుత్వ ఆరోగ్య సంక్షేమ శాఖ తాజాగా మంగళవారం రాత్రి విడుదల చేసిన వివరాల ప్రకారం… మంగళవారం రాష్ట్రంలో 56 కొత్త కేసులు నమోదయ్యాయి. కాగా మంగళవారం సూర్యపేట జిల్లాలో 26 కేసులు నమోదు కాగా, జిహెచ్ఎంసిలో 19, నిజామాబాద్‌లో 3, గద్వాల్లో 2, ఖమ్మం 1, మేడ్చల్ 1, వరంగల్ 1, ఆదిలాబాద్ 2, రంగారెడ్డి 1 కేసులు కలిపి ...
Read More »టెలి మెడిసిన్ కేంద్రం ద్వారా 114 మందికి సలహాలు
కామారెడ్డి, ఏప్రిల్ 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన టెలిమెడిసిన్ కేంద్రం ద్వారా జిల్లాలోని ప్రజలకు ఫోన్ ద్వారా అడిగిన సమస్యల పట్ల వైద్యులు తగు సలహాలు, సూచనలు ఇస్తున్నారని డిఎం అండ్ హెచ్‌వో డాక్టర్ చంద్రశేఖర్ తెలిపారు. జిల్లాలో కరోనా వ్యాపించకుండా వైద్య బృందాలు, అన్ని శాఖలతో సమన్వయంతో ఏర్పాటు చేసిన స్థానిక కరోనా కంట్రోల్, రెస్పాన్స్ బృందం నిరంతరం తమ పరిధిలోని ప్రాంతాలను ఆరోగ్య బోధనలో జాగ్రత్తలు తీసుకోవడం ...
Read More »కరోనా కట్టడి కోసం పనిచేస్తున్న శాఖల సేవలు వెలకట్టలేనివి
నిజామాబాద్, ఏప్రిల్ 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కరోనా కట్టడి కోసం పనిచేస్తున్న శాఖలవారి సేవలు వెలకట్టలేనివని రాష్ట్ర రోడ్లు మరియు భవనా ల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. మంగళవారం వేల్పూర్ సొసైటీ దగ్గర బిల్డర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కార్యక్రమానికి మంత్రి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. విపత్తు కాలంలో ప్రజల్ని కరోనా బారిన పడకుండా చేస్తున్న హెల్త్ డిపార్ట్మెంట్, రెవెన్యూ, పోలీస్, అంగన్వాడి, మీడియా, ప్రజలు అంతా ఒక్కటై కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు పనిచేస్తున్నదని ...
Read More »లాక్ డౌన్ కట్టుదిట్టం చేయాలి
కామారెడ్డి, ఏప్రిల్ 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : లాక్ డౌన్ కట్టుదిట్టం చేయాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ శరత్ అన్నారు. కామారెడ్డి పట్టణంలోని కొత్త బస్టాండ్, సిరిసిల్లా రోడ్డు, గంజి రోడ్, జెపిఎన్ రోడ్లో మంగళవారం ఆయన పర్యటించారు. లాక్ డౌన్ పకడ్బందీగా అమలు చేయాలని సూచించారు. మధ్యాహ్నం రెండు గంటల వరకే అన్ని వ్యాపార సంస్థలు మూసివేయాలని వ్యాపారులను ఆదేశించారు. వినియోగదారులు సామాజిక దూరం పాటించే విధంగా చూడాలని కోరారు. ఆంధ్ర బ్యాంకు అధికారులతో మాట్లాడారు. ఖాతాదారులు సామాజిక దూరం ...
Read More »కామారెడ్డిలో శాంతికమిటీ సమావేశం
కామారెడ్డి, ఏప్రిల్ 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సంచార వాహనాల ద్వారా కూరగాయలు, పండ్లను కాలనీల్లో విక్రయించే విధంగా చర్యలు తీసుకుంటామని ఆర్డిఓ రాజేంద్ర కుమార్ అన్నారు. కామారెడ్డి ఆర్డీవో కార్యాలయంలో మంగళవారం రంజాన్ పండగ నేపథ్యంలో ముస్లింలతో శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శాంతియుతంగా తమ ఇళ్లలోనే రంజాన్ ప్రార్థనలు జరుపుకోవాలని సూచించారు. లాక్ డౌన్ నేపథ్యంలో రోడ్లపై ఒకరి కంటే ఎక్కువమంది తిరగవద్దని డిఎస్పి లక్ష్మీనారాయణ కోరారు. సమావేశంలో తహసిల్దార్ అమీన్ సింగ్, ...
Read More »ఉద్యోగులు అనవసరంగా బయట తిరిగితే క్రమశిక్షణ చర్యలు
నిజామాబాద్, ఏప్రిల్ 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఉద్యోగులు అవసరం లేకున్నా ఆన్ డ్యూటీ స్టిక్కర్ వేసుకొని బయట తిరిగితే క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఈ విషయమై జిల్లా అధికారులకు సర్క్యులర్ జారీ చేశారు. ప్రభుత్వం నిర్దేశించిన లాక్ డౌన్ ఆదేశాలకు అనుగుణంగా కొన్ని శాఖలలో రొటేషన్‌లో ఉద్యోగులను కార్యాలయాలకు విధులకు అనుమతించుటకు వెసులుబాటు కల్పించిందని, అయితే కొందరు ఉద్యోగులు విధులలో లేకున్నా కూడా వాహనాలకు ఆన్ డ్యూటీ సిక్కర్లు అతికించుకుని ...
Read More »బిజెపి ఆద్వర్యంలో నిత్యవసర సరుకుల పంపిణీ
నందిపేట్, ఏప్రిల్ 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సాయం చేయండి, సాయం పొందండి కార్యక్రమంలో భాగంగా బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, నిజామాబాద్ ఎంపీ అరవింద్, జిల్లా అధ్యక్షుడు బసవ లక్ష్మీనారాయణ, ఆర్మూర్ నియోజకవర్గ ఇన్చార్జి వినయ్ ఆదేశాల మేరకు నందిపేట ఎంపీటీసీ టు అరుణ, బజరంగ్ చవాన్ పరిధిలోగల రాజ్ నగర్లో రేషన్ కార్డ్ పెండిరగ్లో ఉన్న వారికి, రేషన్ కార్డు లేని వారికి, వలస కూలీలకు, దినసరి కూలీలకు, అంగవైక్యం గల ...
Read More »కాంగ్రెస్ పార్టీ ఆద్వర్యంలో నిత్యవసర సరుకుల పంపిణీ
నందిపేట్, ఏప్రిల్ 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మహారాష్ట్ర నుంచి నందిపేట్ వచ్చిన రోజువారి కూలీలు లాక్ డౌన్ నేపథ్యంలో నూత్పల్లి గ్రామంలో ఉండిపోయారు. సుమారు 90 మంది వలస కూలీలకు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మనాల మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహారాష్ట్ర రాజ్యసభ ఎంపీ రాజీవ్ సతే తమప్రాంత కూలీలు ఇక్కడ ఉన్నారని తెలపడంతో వారి ఆదేశాల మేరకు వలస కూలీలకు గోధుమ పిండి ,కూరగాయలు అందించామన్నారు. ...
Read More »విహెచ్పి, భజరంగ్‌దళ్ ఆధ్వర్యంలో నిత్యవసరాల పంపిణీ
కామారెడ్డి, ఏప్రిల్ 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్ కామారెడ్డిశాఖ ఆధ్వర్యంలో లాక్ డౌన్ సంధర్భంగా కామారెడ్డి పట్టణంలో నిరుపేదలకు సుమారు 40 నుండి 50 కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి వారం రోజులకు సరిపడ నిత్యావసర సరుకులు పంపిణి చేశారు. కార్యక్రమంలో పరిషత్ జిల్లా కార్యదర్శి జంగిటి శ్రీనివాస్, నగర అధ్యక్షుడు పాపిరెడ్డి, భజరంగ్ దళ్ కార్యకర్తలు పాల్గొన్నారు.
Read More »పారిశుద్య కార్మికులకు నిత్యవసర సరుకుల పంపిణీ
కామారెడ్డి, ఏప్రిల్ 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి మండలం లింగపూర్ గ్రామంలో మంగళవారం గ్రామపంచాయతీ భవనం వద్ద అంగన్వాడి టీచర్లు, 9 వ వార్డ్, 11 వార్డ్ కౌన్సిలర్లు సంయుక్తంగా గ్రామ పారిశుద్ద్య కార్మికులకు 15 రోజులకు సరిపడా నిత్యవసర వస్తువులు పంపిణీ చేశారు. ఏఎన్ఎం, ఆశ కార్యకర్తలకు కూడా వస్తువులు పంపిణీ చేశారు. ముఖ్య అతిధిగా దేవనపల్లి సెక్టార్ సూపర్వైజర్ నాగమణి హాజరై మాట్లాడారు. లాక్ డౌన్ నేపథ్యంలో పారిశుద్ధ్య కార్మికులకు వస్తువులు అందించడం గొప్పవిషయమని పేర్కొన్నారు. 11 ...
Read More »జర్నలిస్టులు కింది జాగ్రత్తలు తీసుకోవాలి
హైదరాబాద్, ఏప్రిల్ 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ముంబయిలో 53 మంది జర్నలిస్టులకు కరోనా వైరస్ సోకిన వార్తలు వస్తున్నందున తెలుగు రాష్టాల్లోని జర్నలిస్టులందరూ వైరస్ బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమి చైర్మన్ అల్లం నారాయణ జర్నలిస్టులకు విజ్ఞప్తి చేశారు. వైద్యులు, వైద్య సిబ్బంది, పోలీసులు, పారిశుధ్య కార్మికులు, పారిశుధ్య సిబ్బందితో పాటు జర్నలిస్టులు కూడా వైరస్ ప్రభావం పొంచి ఉన్నప్పటికీ జర్నలిస్టుల సమాచార సేకరణ కోసం విధి నిర్వహణలో నిరంతరం పాల్గొంటున్నారు. ఇట్లాంటి ...
Read More »మాస్కులు ధరించకుంటే జరిమానాలు
కామారెడ్డి, ఏప్రిల్ 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మాస్కు ధరించకుంటే జరిమానాలు విధించాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ శరత్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్ జనహితలో మంగళవారం జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో మండల స్థాయి అధికారులతో మాట్లాడారు. ప్రతి ఒక్కరూ మాస్కూులు తప్పనిసరిగా ధరించాలని, దరించనివారి వద్ద అధికారులు రూ. 500 చొప్పున జరిమానా విధించాలని ఆదేశించారు. కంటోన్మెంట్ ఏరియాలో భద్రతను మరింత కట్టుదిట్టం చేయాలని, సీసీ కెమెరాల పర్యవేక్షణ ఉన్నందున అనుమతి లేకుండా బయట తిరిగిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని సూచించారు. ...
Read More »రీ సైక్లింగ్‌కు ఉపయోగపడని ప్లాస్టిక్ వినియోగించవద్దు
నిజామాబాద్, ఏప్రిల్ 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్లాస్టిక్ నిషేధంపై అధికార యంత్రాంగం తీవ్రంగా కృషి చేస్తోంది. అందులో భాగంగా నిజామాబాద్ మున్సిపాలిటీ అధికారులు కూడా ప్లాస్టిక్ నిషేధంపై దృష్టి సారించారు. ప్రభుత్వం ఆమోదించిన ప్రమాణం కన్న తక్కువ మైక్రాన్ ప్లాస్టిక్ వస్తువులను వినియోగిస్తే కేసు నమోదు చేస్తామని హెచ్చరిస్తూ పలు దుకాణాలపై దాడులు చేసి జరిమానాలు కూడా విధిస్తున్నారు. నిజామాబాద్ పట్టణంలో రీ సైక్లింగ్‌కు ఉపయోగపడని ప్లాస్టిక్‌ను వినియోగించకూడదని మున్సిపల్ అధికారులు గతంలో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. అయినా నిజామాబాద్ ...
Read More »