Breaking News

టెలి మెడిసిన్‌ కేంద్రం ద్వారా 114 మందికి సల‌హాలు

కామారెడ్డి, ఏప్రిల్‌ 21

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాల‌యంలో ఏర్పాటు చేసిన టెలిమెడిసిన్‌ కేంద్రం ద్వారా జిల్లాలోని ప్రజల‌కు ఫోన్‌ ద్వారా అడిగిన సమస్యల‌ పట్ల వైద్యులు తగు సల‌హాలు, సూచనలు ఇస్తున్నారని డిఎం అండ్‌ హెచ్‌వో డాక్టర్‌ చంద్రశేఖర్‌ తెలిపారు.

జిల్లాలో కరోనా వ్యాపించకుండా వైద్య బృందాలు, అన్ని శాఖల‌తో సమన్వయంతో ఏర్పాటు చేసిన స్థానిక కరోనా కంట్రోల్‌, రెస్పాన్స్‌ బృందం నిరంతరం తమ పరిధిలోని ప్రాంతాల‌ను ఆరోగ్య బోధనలో జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుందన్నారు.

జిల్లా కలెక్టర్‌, ఎస్‌పి, ప్రభుత్వ మార్గదర్శకాల‌ ప్రకారం అన్ని రకాల‌ నివారణ చర్యలు తీసుకుంటున్నామన్నారు. టెలిమెడిసిన్‌ కేంద్రంలో ఉదయం 9 గంటల‌ నుంచి రాత్రి 7 గంటల‌ వరకు డాక్టర్‌ కరుణశ్రీ సల‌హాలు అందిస్తారని 80740 55355 నెంబర్‌లో సంప్రదించాల‌న్నారు. కేంద్రం ద్వారా ఇంతవరకు 114 మందికి సల‌హాలు అందించడం జరిగిందన్నారు.

Check Also

రావణ దహనం రద్దు… కోవిడ్‌ నిబంధనలతో బతుకమ్మ ఉత్సవాలు

కామరెడ్డి, అక్టోబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండల కేంద్రంలో ఆదివారం జరగనున్న ...

Comment on the article