Breaking News

తెలంగాణలో 928 కి చేరిన కరోనా పాజిటివ్‌ కేసులు

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 21

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ తెలంగాణలో తన ప్రతాపాన్ని చూపిస్తుంది. తెలంగాణ ప్రభుత్వ ఆరోగ్య సంక్షేమ శాఖ తాజాగా మంగళవారం రాత్రి విడుదల‌ చేసిన వివరాల‌ ప్రకారం… మంగళవారం రాష్ట్రంలో 56 కొత్త కేసులు నమోదయ్యాయి. కాగా మంగళవారం సూర్యపేట జిల్లాలో 26 కేసులు నమోదు కాగా, జిహెచ్‌ఎంసిలో 19, నిజామాబాద్‌లో 3, గద్వాల్‌లో 2, ఖమ్మం 1, మేడ్చల్‌ 1, వరంగల్‌ 1, ఆదిలాబాద్‌ 2, రంగారెడ్డి 1 కేసులు కలిపి 56 నమోదయ్యాయి.

ఇదిలా ఉండగా తెలంగాణలో మొత్తం కేసులు 928కి చేరుకున్నాయి. కరోనా నుండి కోలుకుని డిశ్చార్జి అయినవారు మొత్తం 194 కాగా మంగళవారం 8 మంది డిశ్చార్జి అయ్యారు. అదేవిధంగా 23 మంది ఇంతవరకు కరోనాకు బలై మృత్యువాత పడ్డారు.

Check Also

సోమవారంలోగా ఐదుగురిని నియమించాలి

నిజామాబాద్‌, జూన్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమం, హరితహారం, ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ పై కలెక్టరేట్‌ ...

Comment on the article