Breaking News

ప్రజలు వచ్చే అన్ని ప్రదేశాల్లో కరోనా జాగ్రత్తలు తీసుకోవాలి

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 21

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ధాన్యం కొనుగోలు కేంద్రాల‌కు ధాన్యాన్ని తీసుకొచ్చే రైతుల‌కు, అదేవిధంగా ప‌లు నిత్యవసర సరుకుల‌ అవసరాల‌ నిమిత్తం వచ్చే ప్రదేశాల‌లో కరోనా వైరస్‌ నిరోధానికి అవసరమైన చర్యలు తీసుకోవాల‌ని నిజామాబాద్‌ జిల్లా కలెక్టర్‌ నారాయణరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.

కొనుగోలు కేంద్రాల‌ వద్దకు రైతులు ధాన్యాన్ని తీసుకొస్తారని, అదేవిధంగా కూలీలు ఉపాధి హామీ పథకం పనుల‌లో హాజరు కావడానికి వస్తారని, వ్యవసాయ పనులు కొనసాగుతూ ఉంటాయని ప్రజలు ప్రతి రోజు నిత్యావసరాల‌కు, కూరగాయల‌కు, మాంసం కొరకు, కిరాణా సామాన్లకు దుకాణాల‌కు వస్తుంటారని అదేవిధంగా బ్యాంకుల‌ నుండి డబ్బు డ్రా చేసుకోవడానికి కూడా పెద్ద సంఖ్యలో వస్తుంటారని, ఇలాంటి ప్రదేశాల‌లో తగిన జాగ్రత్తలు తీసుకోకుంటే కరోనా వైరస్‌ ఒకరి నుండి ఒకరికి విస్తరించే ప్రమాదం ఉంటుందని తెలిపారు.

అందువ‌ల్ల‌ సంబంధిత యాజమాన్యాలు తప్పనిసరిగా ఆయా ప్రాంతాల‌లో వారి పరిధిలో అక్కడికి వచ్చే ప్రజలు వైరస్‌ జాగ్రత్తలు పాటించే విధంగా చర్యలు తీసుకోవాల‌ని ఆదేశించారు.

ముఖ్యంగా నూటికి నూరు శాతం సామాజిక దూరం పాటించే విధంగా ఏర్పాటు చేసుకోవాల‌ని, మాస్కు లేకుండా ఎవరిని కూడా ఆ ప్రాంతానికి అనుమతించవద్దని వారి వారి దుకాణాల‌ వద్ద సానిటైజర్‌ లేదా సబ్బును- నీళ్లను ఏర్పాటు చేసి చేతులు శుభ్రం చేసుకునే విధంగా ప్రత్యేక ఏర్పాట్లు చేయాల‌ని స్పష్టం చేశారు. ఈ ఏర్పాట్లు లేకుండా తమ వ్యాపారాన్ని ప్రారంభించ వద్దని కఠినంగానే చెప్పారు.

Check Also

22న ఆన్‌లైన్‌లో ఓపెన్‌ హౌస్‌ కార్యక్రమం

నిజామాబాద్‌, అక్టోబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పోలీస్‌ అమరవీరుల దినోత్సవం సందర్భంగా 4వ టౌన్‌ పోలీస్‌ ...

Comment on the article