Breaking News

ఉద్యోగులు అనవసరంగా బయట తిరిగితే క్రమశిక్షణ చర్యలు

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 21

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉద్యోగులు అవసరం లేకున్నా ఆన్‌ డ్యూటీ స్టిక్కర్‌ వేసుకొని బయట తిరిగితే క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్‌ నారాయణరెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఈ విషయమై జిల్లా అధికారుల‌కు సర్క్యుల‌ర్‌ జారీ చేశారు.

ప్రభుత్వం నిర్దేశించిన లాక్‌ డౌన్‌ ఆదేశాల‌కు అనుగుణంగా కొన్ని శాఖల‌లో రొటేషన్‌లో ఉద్యోగుల‌ను కార్యాల‌యాల‌కు విధుల‌కు అనుమతించుటకు వెసులుబాటు కల్పించిందని, అయితే కొందరు ఉద్యోగులు విధుల‌లో లేకున్నా కూడా వాహనాల‌కు ఆన్‌ డ్యూటీ సిక్కర్‌లు అతికించుకుని అనవసరంగా రోడ్లపైన తిరుగుతున్నారని, ఈ విషయాలు జిల్లా యంత్రాంగం దృష్టికి వచ్చిందని, ఇటువంటి ఉద్యోగుల‌పై యంత్రాంగం చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు.

ఈ విధంగా ప్రవర్తించడం లాక్‌ డౌన్‌ నిబంధనల‌ను ఉల్లంఘించడమే అవుతుందని కలెక్టర్‌ పేర్కొన్నారు. అంతేకాక వైరస్‌ వ్యాప్తికి కారణమవడంతో పాటు ఆ కుటుంబాల‌లో వైరస్‌ వ్యాప్తి చెందడానికి అవకాశం క‌లుగుతుందని, తద్వారా ఆ కుటుంబాల‌కు కూడా ప్రమాదకరమని తెలిపారు. అత్యవసర విధులు నిర్వహించే పోలీస్‌, వైద్య ఆరోగ్య శాఖ, రెవెన్యూ, అగ్నిమాపక తదితర శాఖల‌లో పనిచేసే అధికారులు, సిబ్బందికి మాత్రమే కార్యాల‌యాల‌ వేళ తర్వాత కూడా విధుల‌కు హాజరు కావడానికి ప్రభుత్వ ఆదేశాలు ఉన్నాయని, ఇతరుల‌కు అవకాశం లేదని జిల్లా అధికారులు ఈ విషయాల‌ను పరిశీలించి సంబంధిత సిబ్బందికి ఆదేశాలు జారీ చేయాల‌ని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

అదేవిధంగా కొందరు అధికారులు కుటుంబ సభ్యులు, ప్రైవేటు వ్యక్తులు కూడా ప్రభుత్వ వాహనాల‌లో నిబంధనల‌కు విరుద్ధంగా స్టిక్కర్లు అతికించుకొని బయట తిరుగుతున్నారని అలాంటి వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు.

లాక్‌ డౌన్‌ నిబంధనలు ఎవరు అతిక్రమించినా, అదేవిధంగా వారు అధికారులు కానీ ఉద్యోగులు కానీ వారిపై యంత్రాంగం సీరియస్‌గా, కఠినంగా క్రమశిక్షణ చర్యలు, క్రిమినల్‌ చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఉత్తర్వుల‌లో కలెక్టర్‌ హెచ్చరించారు.

Check Also

22న ఆన్‌లైన్‌లో ఓపెన్‌ హౌస్‌ కార్యక్రమం

నిజామాబాద్‌, అక్టోబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పోలీస్‌ అమరవీరుల దినోత్సవం సందర్భంగా 4వ టౌన్‌ పోలీస్‌ ...

Comment on the article