Breaking News

లాక్‌ డౌన్‌ కట్టుదిట్టం చేయాలి

కామారెడ్డి, ఏప్రిల్‌ 21

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : లాక్‌ డౌన్‌ కట్టుదిట్టం చేయాల‌ని కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ శరత్‌ అన్నారు. కామారెడ్డి పట్టణంలోని కొత్త బస్టాండ్‌, సిరిసిల్లా రోడ్డు, గంజి రోడ్‌, జెపిఎన్‌ రోడ్‌లో మంగళవారం ఆయన పర్యటించారు. లాక్‌ డౌన్‌ పకడ్బందీగా అమలు చేయాల‌ని సూచించారు. మధ్యాహ్నం రెండు గంటల‌ వరకే అన్ని వ్యాపార సంస్థలు మూసివేయాల‌ని వ్యాపారుల‌ను ఆదేశించారు. వినియోగదారులు సామాజిక దూరం పాటించే విధంగా చూడాల‌ని కోరారు.

ఆంధ్ర బ్యాంకు అధికారుల‌తో మాట్లాడారు. ఖాతాదారులు సామాజిక దూరం పాటిస్తున్నారని బ్యాంకు అధికారులు పేర్కొన్నారు. ఎస్‌పి స్వేత మాట్లాడారు. పని లేకుండా ప్రజలు బయటకు వస్తే కేసులు చేస్తామని స్పష్టం చేశారు.

అత్యవసరం ఉంటేనే కుటుంబానికి ఒక్కరే బయటకు వచ్చి నిత్యవసర వస్తువులు తీసుకెళ్లాల‌ని సూచించారు. కార్యక్రమంలో ఆర్‌డిఓ రాజేంద్ర కుమార్‌, డీఎస్‌పి ల‌క్ష్మీనారాయణ, మున్సిపల్‌ కమిషనర్‌ శైల‌జ, తహసిల్దార్‌ అమీన్‌ సింగ్‌, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Check Also

రావణ దహనం రద్దు… కోవిడ్‌ నిబంధనలతో బతుకమ్మ ఉత్సవాలు

కామరెడ్డి, అక్టోబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండల కేంద్రంలో ఆదివారం జరగనున్న ...

2 comments

  1. Charan Thakur

    Must be logged don for sure🙏

  2. RAKESH.E

    SOME OF THEM ARE GOING FROM ONE PLACE TO ANOTHER PLACE IN EARLY MORING HOURS BY USING SHORT CUTS.PLEASE CONCENTRATE.

Comment on the article