Breaking News

కామారెడ్డిలో శాంతికమిటీ సమావేశం

కామారెడ్డి, ఏప్రిల్‌ 21

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సంచార వాహనాల‌ ద్వారా కూరగాయలు, పండ్లను కాల‌నీల్లో విక్రయించే విధంగా చర్యలు తీసుకుంటామని ఆర్‌డిఓ రాజేంద్ర కుమార్‌ అన్నారు. కామారెడ్డి ఆర్డీవో కార్యాల‌యంలో మంగళవారం రంజాన్‌ పండగ నేపథ్యంలో ముస్లింల‌తో శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శాంతియుతంగా తమ ఇళ్లలోనే రంజాన్‌ ప్రార్థనలు జరుపుకోవాల‌ని సూచించారు. లాక్‌ డౌన్‌ నేపథ్యంలో రోడ్లపై ఒకరి కంటే ఎక్కువమంది తిరగవద్దని డిఎస్‌పి ల‌క్ష్మీనారాయణ కోరారు. సమావేశంలో తహసిల్దార్‌ అమీన్‌ సింగ్‌, సీఐ జగదీష్‌ పాల్గొన్నారు.

Check Also

రావణ దహనం రద్దు… కోవిడ్‌ నిబంధనలతో బతుకమ్మ ఉత్సవాలు

కామరెడ్డి, అక్టోబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండల కేంద్రంలో ఆదివారం జరగనున్న ...

Comment on the article