Breaking News

సౌదీలో గుండె పోటుతో మరణించిన కుటుంబానికి సహాయం

కామారెడ్డి, ఏప్రిల్ 22

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సౌదీ అరేబియాలో క్యాసంపల్లి తండాకు చెందిన పిపావత్‌ సేవ్య గత 8 సంవత్సరాల‌నుండి హౌస్‌ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. కాగా ఏప్రిల్‌ 11 న గుండె పోటుతో మరణించాడు. ఆర్థికంగా ఇబ్బందిలో ఉన్న కుటుంబానికి తండా యువకులు 175 కిలోల‌ బియ్యం సేకరించి అందించారు.

ప్రభుత్వం దృష్టికి విషయం తీసుకెళ్లి ఆర్థిక సహాయం చేయడానికి కృషి చేస్తామని మనోధైర్యం ఇచ్చారు. కార్యక్రమంలో రూప్‌ సింగ్‌, కరణ్‌, శ్రీను, ధర్‌ సింగ్‌, కిషన్‌, హుస్సేన్‌, నరేష్‌, సంతోష్‌ తదితరులు పాల్గొన్నారు.

Check Also

కరోనా నుంచి ప్రపంచాన్ని రక్షించుమని ప్రార్థన

కామారెడ్డి, ఆగష్టు 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బక్రీద్‌ సందర్భంగా మాజీ మంత్రి, మాజీ మండలి ప్రతిపక్ష ...

Comment on the article