Breaking News
ఎండోమెంట్‌ కమిషనర్‌ శ్రీ రంగనాథ దేవాల‌యం భూమిని రిజిస్ట్రేషన్‌ చేయవద్దని బౌండ్రీస్‌ ఏర్పాటు చేయమని రాసిన లెటర్‌ ఇదే

తస్మాత్‌ జాగ్రత్త…

దేవునికి షట గోపం (పంగనామాలు) పెట్టిన భూ బకాసురులు…

కామారెడ్డి, ఏప్రిల్‌ 22

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి పట్టణంలోని గాంధీచౌక్‌ నుండి బస్టాండ్‌ వరకు రొడ్డకు ఎడమ వైపున మొదలుకొని బిసి కాల‌నీ, ప్రియ టాకీస్‌ 1 ఎకరం 10 గుంటతో పాటు రాందాస్‌ బావి, బావి చుట్టు పక్కల‌ పరిసర ప్రాంతము, ఎర్రమన్ను కుచ్చా ఆంజనేయ స్వామి గుడి నుండి వెంచర్ల వరకు పన్నాలాల్‌ కుటుంబానికి సంబందించిన బద్రి బిషాల్‌ పిట్టి అనే మార్వాడీ వ్యాపారికి పు సర్వే నెంబర్లు అనగా 42, 43, 44, 45, 54, 583, 584, 586, 587, 588, 589, 591, 592, 595, 596, 597, 598, 600, 601, 602 వరకు 20 సర్వే నంబర్‌లో 19.21 భూమిని హైద్రాబాద్‌ షేర్‌ లింగంపల్లిలోని నానకరాం గూడలో గల‌ శ్రీరంగ నాథ స్వామి పేర 18.8.1954లో రిజిస్ట్రేషన్‌ జరిగింది.

రిజిస్ట్రేషన్‌ (డాక్యూమెంట్‌) నంబర్‌ 1367 ఆఫ్‌ 1954 నాడు రిజిస్ట్రేషన్‌ దేవుని పేర బద్రి బిషాల్‌ పిట్టి చేశారు. అట్టి భూమిపై భూ బకాసురులు కన్నేశారు. ఇంకేముంది ఫేక్‌ రెజిస్ట్రేషన్‌లు చేయడం మొదలు పెట్టి దేవుని భూమికే ఎసరుపెట్టి భూ మాఫియాగా పేరు ప్రతిష్టలు సంపాదించారు. 1970 సంవత్సరం నుండి 2019 ఆగస్ట్‌ వరకు 238 రిజిస్ట్రేషన్‌ చేసి క్రయ విక్రయాలు జరిపారు. అంటే ఏ విధంగా దేవుని సొమ్మును కొల్ల‌ గొట్టారో మీకు తెలిసే ఉంటుంది.

అవినీతి అధికారుల‌ అండ దండల‌తో భూ మాఫియా ఆడిరదే ఆట పాడిరదే పాటగా తయారైంది. ఎండోమెంట్‌ కమిషనర్‌ దగ్గర నుండి ఎల్లారెడ్డిలోని సబ్‌ రిజిస్టర్‌ ఆఫీస్‌కు, తహసిల్‌ కార్యాల‌యానికి 18.12.2019 రోజు లెటర్‌ ఇచ్చి రిజిస్ట్రేషన్‌లు నిలిపి వేయాల‌ని మరియు బౌండ్రీస్‌ ఏర్పాటు చేయమని దేవస్థానం తరుపున విజ్ఞప్తి చేశారు. అధికారులు మాత్రం పెడ చెవిన పెట్టారు.

తర్వాత కలెక్టర్‌ స్థాయి అధికారి రంగంలోకి దిగితే రిజిస్ట్రేషన్‌లు నిలిపేశారు. కానీ బౌండ్రీస్‌ ఏర్పాటు చేయక పోవడం సిగ్గు చేటు. ఇప్పటికైనా దేవాల‌య భూమిపై క్రయ విక్రయాలు జరుపకుండ చూసి ప్రజల‌ను మోసం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాల‌ని భక్తులు కోరుచున్నారు. ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాల‌ని వారు అంటున్నారు.

Check Also

బసవేశ్వరుని బోధనలు ఆచరణీయం

సంగారెడ్డి, ఏప్రిల్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆదివారం జహీరాబాద్‌ ఎంపీ బి.బి పాటిల్‌, ఆర్ధిక శాఖ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *