Breaking News

నిజామాబాద్‌ వాసి సౌదీలో కరోనాతో మృతి

మాజీ ఎంపి కవిత సహకారంతో అంత్యక్రియలు పూర్తి

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 22

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శరీర అంతిమ ప్రయాణం స్మశానం చేరికతో ముగుస్తుంది. నా అనుకున్న నలుగురి సమక్షంలో సాంప్రదాయం ప్రకారం అంత్యక్రియల నిర్వహణ జరుగుతది. కానీ ప్రస్తుత కరోనా కాలంలో ఎంత దయనీయ పరిస్థితిని ఎదుర్కొంటున్నామో తెలిసిందే. ఇటువంటి విషాదమే తెలంగాణవాసికి ఎదురైంది. నిజామాబాద్‌వాసి మహమ్మద్‌ అజ్మతుల్లా సౌదీలోని మక్కాలో గత 35 ఏళ్లుగా పనిచేస్తున్నాడు.

కొన్ని రోజులుగా జ్వరంతో బాధపడుతున్నాడు. ఆస్పత్రిలో చేరగా కరోనా వైరస్‌ భారిన పడ్డట్లు తేలింది. పరిస్థితి విషమించడంతో గడిచిన గురువారం ఉదయం మృతిచెందాడు. మృతుడికి నలుగురు సంతానం. వీరంతా సౌదీలోని వివిధ ప్రాంతాల్లో ఉంటున్నప్పటికీ కర్ఫ్యూ కారణంగా మృతిచెందిన తండ్రి వద్దకు వెళ్లలేకపోయారు. దీంతో అంత్యక్రియల‌కు ఇబ్బందులు ఏర్పడ్డాయి.

సమాచారం తెలిసిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎంపీ కవిత స్పందించారు. సహాయం చేయాల్సిందిగా తెలంగాణ జాగృతి సౌదీ అరేబియా నాయకుల‌ను కోరారు. దీంతో జాగృతి సౌదీ అరేబియా నాయకులు మౌజం అలీ ఇఫ్తెకార్‌ అంత్యక్రియలు నిర్వహించేందుకు ముందుకొచ్చారు.

సామాజిక కార్యకర్త ముజీబ్‌ సహకారంతో సంబంధిత పత్రాలు సమర్పించి అన్ని రకాల‌ ప్రక్రియల‌ను పూర్తి చేసి అంత్యక్రియల‌ను నిర్వహించారు. తమ తండ్రి అంత్యక్రియలు నిర్వహించడం పట్ల కుటుంబ సభ్యులు మాజీ ఎంపీ కవితకు, సౌదీ అరేబియా జాగృతి నాయకుల‌కు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

Check Also

నిజామాబాద్‌లో విస్తృతంగా పర్యటించిన అర్బన్‌ ఎమ్మెల్యే

నిజామాబాద్‌, మే 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ నగరంలో చేపడుతున్న పలు అభివృద్ధి పనుని ఎమ్మెల్యే ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *