Breaking News

కొత్త వ్యక్తులు వస్తే పోలీసుల‌కు సమాచారం ఇవ్వండి

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 22

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మనం కరోనా అనే కనిపించని శత్రువుతో పోరాడుతున్నామని అనుక్షణం అప్రమత్తంగా ఉంటేనే క్షేమంగా ఉంటామని నిజామాబాద్‌ జిల్లా కలెక్టర్‌ నారాయణరెడ్డి గ్రామస్థాయి, మున్సిపల్‌ స్థాయి ప్రజాప్రతినిధుల‌కు వీడియో ద్వారా సందేశం ఇచ్చారు.

ఈ సందర్భంగా కలెక్టర్‌ గ్రామ పంచాయతీ ప్రజా ప్రతినిధులు, మున్సిపాలిటీ ప్రజా ప్రతినిధుల‌తో మాట్లాడుతూ మహమ్మారి వైరస్‌ను కట్టడి చేయడానికి ప్రభుత్వం లాక్‌ డౌన్‌ మే 7వ తేదీ వరకు పొడిగించారని తమ పరిధిలోని ప్రజలందరూ అత్యంత జాగ్రత్తగా అసలు ఏ విధంగా వైరస్‌ను కట్టడి చేయడానికి నిర్దేశించిన జాగ్రత్తల‌న్నీ పాటించే విధంగా అవగాహన కల్పించాల‌న్నారు. అదేవిధంగా ప్రజలు తప్పనిసరి అయితే తప్ప బయటకు వెళ్ళవద్దని మీ తరఫున తెలియజేయాల‌ని, ఒకవేళ అత్యవసర పరిస్థితుల్లో వెళ్ళవల‌సి వస్తే తప్పనిసరిగా మాస్కు ధరించాల‌ని చెప్పాల‌ని వెళ్లిన చోట మీటర్‌ దూరం వ్యక్తికి వ్యక్తికి పాటించే విధంగా జాగ్రత్తగా ఉండాల‌ని తెలియజేయాల‌న్నారు.

అవసరాల‌కు దుకాణాల‌కు వెళ్ళినప్పుడు అన్ని విషయాలు పరిశీలించి వెళ్లిన పని చేసుకునే విధంగా చూడాల‌న్నారు. అదేవిధంగా మీ ప్రాంతంలో ఎవరైనా కొత్త వ్యక్తులు తారసపడితే వారి పూర్తి వివరాలు సేకరించాల‌ని అనుమానం వస్తే పోలీసుల‌కు కానీ రెవెన్యూ అధికారుల‌కు కానీ సమాచారం ఇవ్వాల‌ని కోరారు.

పట్టణాల‌లో స్వచ్ఛంద సేవా సంస్థల‌ ఆధ్వర్యంలో పేదల‌కు, వల‌స కూలీల‌కు, అనాధల‌కు భోజనాలు తదితర సేవా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారని, ఈ విషయంలో వారు చేస్తున్న సేవ‌లు అభినందనీయమని తెలుపుతూ ఇలాంటి కార్యక్రమాలు కూడా తప్పనిసరిగా లాక్‌ డౌన్‌ జాగ్రత్తలు తీసుకునే విధంగా చూడాల‌ని ఆయన కోరారు. అందరం ఒక్కటై కలిసికట్టుగా కరోనాపై పోరాడి కరోనా ఫ్రీ జిల్లాగా తీర్చిదిద్దుకుందామని కలెక్టర్‌ ప్రజల‌కు, ప్రజాప్రతినిధుల‌కు ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.

Check Also

మాక్లూర్‌లో ఐసోలేషన్‌ సెంటర్‌

నిజామాబాద్‌, ఆగష్టు 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లాలో కోవిడ్‌ బారినపడి మైల్డ్‌ సింప్టమ్స్‌ కలిగి ...

Comment on the article