Breaking News

ఆర్‌ఎంపి, పిఎంపిలు వైద్యం చేయరాదు

కామారెడ్డి, ఏప్రిల్‌ 22

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి చంద్రశేఖర్‌ బుధవారం ఆరోగ్య సేవల‌ను సమీక్షించారు. కరోనా కట్టడి చర్యలు పూర్తి స్థాయిలో తీసుకోవాల‌ని, అందరికి ఆరోగ్య సేలు అందించాల‌ని వైద్య అధికారుల‌కు, ఆరోగ్య సిబ్బందికి సూచించారు. ప్రయివేటు ఆసుపత్రులు ఆరోగ్య శాఖలో నమోదైన వారు తమ సేలు అందించాల‌ని, తమ ఆసుపత్రికి జ్వరం, జలుబు, దగ్గు ల‌క్షణాలున్న వారు వస్తే వివరాలు కోవిడ్‌ కంట్రోల్‌ రూంకు తెలియజేయాల‌న్నారు.

7382928649, 7382929356 నెంబర్‌కు తెలియజేయాల‌ని పేర్కొన్నారు. జిల్లాలో ఆర్‌ఎంపి, పిఎంపి వైద్యులు ఎలాంటి చికిత్సలు చేయవద్దని, అటువంటి వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని జిల్లా ప్రోగ్రాం అధికారి డాక్టర్‌ శాయిద్‌ అలీ సూచించారు.

బాన్సువాడ పట్టణానికి చెందిన ఎనిమిది మంది రక్తనమూనాలు మంగళవారం సేకరించి గాంధీ ఆసుపత్రి ల్యాబుకు పంపగా నెగిటివ్‌ వచ్చినట్టు డిఎం అండ్‌ హెచ్‌వో తెలిపారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.

The following two tabs change content below.

Check Also

యువకుని రక్తదానం

కామరెడ్డి, అక్టోబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సిరికొండ మండలం కొంపల్లి గ్రామానికి చెందిన అమ్ము 33 ...

Comment on the article