Breaking News

నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు

కామారెడ్డి, ఏప్రిల్‌ 22

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటాంటామని కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ శరత్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్‌ జనహితలో బుధవారం జరిగిన శాంతి కమిటీ సమావేశంలో మాట్లాడారు. కామారెడ్డి, బాన్సువాడకంటోన్మెంట్‌ ఏరియాలో ప్రజల‌ను బయటకు వెళ్లనివ్వకూడదని, సంచార వాహనాల‌ ద్వారా వారికి నిత్యవసర వస్తువులు, కూరగాయలు అందించాల‌ని పేర్కొన్నారు.

రంజాన్‌ సందర్భంగా ముస్లిరలు ప్రార్థనలు చేయడానికి మసీదుకు వెళ్లవద్దని, కరోనా నేపథ్యంలో ఇళ్లలోనే ప్రార్థనలు చేసుకోవాల‌ని కోరారు. లాకుడౌను అమల్లో ఉన్నందున కాల‌నీలోకి సంచార వాహనాల‌ ద్వారా నిత్యవసర వస్తువులు, పండ్లు వస్తాయని చెప్పారు. మసీదుల్లో ప్రార్థనలు చేయడానికి ఇమామ్‌తో పాటు నలుగురికి అనుమతి ఉంటుందని సూచించారు. ఇఫ్తార్‌ విందుకు అనుమతి లేదని, నిబంధనలు కచ్చితంగా పాటించాల‌ని కోరారు.

పద్మాజివాడి చౌరస్తా వద్ద కూరగాయల‌ మార్కెట్‌ లోనే పండ్ల విక్రయాలు జరిగే విధంగా చూడాల‌ని పేర్కొన్నారు. సమావేశంలో ఎస్‌ పి శ్వేత మాట్లాడుతూ రంజాన్‌ పండగ వస్తువులు కావల‌సినవారు వ్యాపారస్తుల‌కు వాట్స్‌అప్‌ ద్వారా సమాచారమిస్తే సంచార వాహనాల‌ ద్వారా సరుకుల‌ను ఇంటికి పంపిస్తారని చెప్పారు. కారణం లేకుండా రోడ్లపైకి ద్విచక్ర వాహనాల‌ను తీసుకువస్తే వాటిని స్వాధీనం చేసుకొని లాక్‌ డౌన్‌ అనంతరం తిరిగి ఇస్తామని పేర్కొన్నారు.

నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌లు యాదిరెడ్డి, వెంకటేష్‌ దోతురే, అసిస్టెంట్‌ కలెక్టర్‌ తేజస్‌ నందలాల్‌ పవర్‌, జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి శబున, ఆర్‌డివోలు రాజేంద్ర కుమార్‌, రాజేశ్వర్‌, దేవేందర్‌ రెడ్డి, డీఎస్‌పిలు ల‌క్ష్మీనారాయణ, శశాంక్‌ రెడ్డి, దామోదర్‌ రెడ్డి, మైనార్టీ ప్రతినిధులు పాల్గొన్నారు.

Check Also

రైతులు లాభసాటి పంట వైపు మొగ్గు చూపాలి

కామారెడ్డి, మే 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి కలెక్టరేట్‌లో కోవిడ్‌-19, ధాన్యం సేకరణ, సమగ్ర వ్యవసాయ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *