Breaking News

అడ్డగోలుగా తరుగు తీస్తామంటే క్రిమినల్‌ కేసు, సీజ్‌

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 24

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర ముఖ్యమంత్రి రైతు శ్రేయస్సును కోరి 30 వేల‌ కోట్ల రూపాయల‌ రుణాలు తెచ్చి 100 శాతం ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి చర్యలు తీసుకోగా మిల్ల‌ర్లు తరుగు పేరుతో ఇష్టమొచ్చినట్టు తూకంలో మోసం చేయడం ఎంత మాత్రం క్షంతవ్యం కాదని, అలాంటి వారిపై క్రిమినల్‌ కేసు పెట్టాల‌ని రాష్ట్ర రహదారులు భవనముల‌ శాసనసభ వ్యవహారాల‌ శాఖామాత్యులు వేముల‌ ప్రశాంత్‌ రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు.

శుక్రవారం మంత్రి నిజామాబాద్‌ కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్‌ నారాయణరెడ్డి, సీపీ కార్తికేయ, రూరల్‌ శాసనసభ్యులు బాజిరెడ్డి గోవర్ధన్‌ ఇతర అధికారుల‌తో కలిసి ధాన్యం కొనుగోలు, కరోనా కట్టడిపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కేంద్రం ఇతర రాష్ట్రాల‌లో ధాన్యాన్ని కొంత శాతం వరకు మాత్రమే సేకరిస్తారని మన రాష్ట్రంలో మాత్రం పూర్తిస్థాయిలో పలురకాల‌ పంట దిగుబడుల‌ను కొనుగోలు చేయడానికి పెద్ద ఎత్తున కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతుల‌కు అవసరమైన సదుపాయాల‌తో వారికి ఇబ్బందులు కల‌గకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.

ఇప్పటికి తొంబై రెండు వేల చిల్ల‌ర మెట్రిక్‌ టన్నుల‌ వరి ధాన్యాన్ని కొనుగోలు చేశామని రైతుకు 52 కోట్ల రూపాయలు కూడా చెల్లించాల‌న్నారు. ఇతర పంట కొనుగోలు కొనసాగుతున్నదని అయితే పెద్ద ఎత్తున దిగుబడి వచ్చిన వరి ధాన్యం కొనుగోలు మన ముందు ఇప్పుడు ఒక ఛాలెంజ్‌గా ఉన్నదని, హమాలి సమస్య, లాక్‌ డౌన్ వ‌ల్ల‌ గన్నీ సంచుల‌ కొరత వల‌న ఇబ్బందులు వస్తున్నప్పటికీ యంత్రాంగం అధిగమించడానికి పలు రకా చర్యలు తీసుకుంటుందని తెలిపారు.

అయితే గత కొన్ని రోజులుగా రైస్ మిల్ల‌ర్లు పేరుతో రైతును ఇబ్బందుల‌కు గురి చేస్తున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయని ఇప్పటికే తాను రూరల్‌ శాసనసభ్యులు మిల్ల‌ర్‌ల‌తో మాట్లాడామని తెలిపారు. రైతును మోసం చేస్తామంటే ఎట్టి పరిస్థితులోనూ ఉపేక్షించేది లేదని తప్పును గుర్తించి ఆ రైస్ మిల్లుపై క్రిమినల్‌ కేసు పెట్టాల‌ని సీజ్‌ చేయాల‌ని ఆదేశించారు. రైతును ధాన్యం ఇచ్చిన తర్వాత వారిని పంపించ అవసరం లేదని తెలిపారు.

కేవలం సెంటర్‌ ఇంచార్జి రైస్‌ మిల్‌కి సంబంధం ఉండాల‌న్నారు. రెండు నియోజకవర్గాల‌లో కూడా ప్రతి మండలానికి ఒక ఇన్‌చార్జి అధికారిని నియమించి సమస్యలు ఉన్న ఇతర మండలాల్లో కూడా ఇన్‌చార్జిల‌ను ఏర్పాటు చేసి వాళ్ల నోడల్‌ ఆఫీసర్‌గా పర్యవేక్షణ చేయవల‌సినదిగా ఎక్కడ కూడా రైతుల‌కు ఇబ్బందులు ఏర్పడకుండా మోసం జరగకుండా ఖచ్చితమైన పర్యవేక్షణ చేయాల‌ని అధికారుల‌ను ఆదేశించారు.

మిల్ల‌ర్లు మోసం చేస్తే యంత్రాంగం ఎంత మాత్రం ఊరుకోదని తప్పనిసరిగా వారిపై క్రిమినల్‌ కేసు బుక్‌ చేస్తామని, మిల్లును సీజ్‌ చేస్తామని ధాన్యం నాణ్యతను పరిశీలించడానికి వ్యవసాయ అధికారులు ఇతర శాఖ అధికారుల‌తో టీమ్లు ఏర్పాటు చేసి కఠినంగా పర్యవేక్షణ చేసే విధంగా చర్యలు తీసుకుంటామని, ఒక కంట్రోల్‌ రూమ్‌ కూడా ఓపెన్‌ చేసి ఫిర్యాదులు స్వీకరించి అందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్‌ తెలిపారు.

కొన్ని రోజులుగా వస్తున్న ఫిర్యాదుల‌ను పరిశీలిస్తే నాణ్యతతో సంబంధం లేకుండా రైస్ మిల్లులో ఇష్టమొచ్చినట్టు తరుగు తీస్తున్నారని తప్పనిసరిగా రైతుల‌కు అన్యాయం జరగకుండా చూడాల‌ని శాసన సభ్యులు గోవర్ధన్‌ కోరారు.

అరవై ఒక్క పాజిటివ్‌ కేసులు, 30 మంది డిశ్చార్జి

అధికారుల‌ సమన్వయంతో పనిచేస్తూ కరోనా వ్యాధి నివారణకు ఎనలేని కృషి చేస్తున్నారని వారినందరిని అభినందిస్తున్నానని మంత్రి తెలిపారు. సమాజం కష్టాల్లో ఉన్నప్పుడే మానవత్వం బయటపడుతుందని వైద్యశాఖ పోలీస్‌ మున్సిపల్‌ శాఖ గ్రామ పంచాయతీ సిబ్బంది రెవెన్యూ శాఖ సిబ్బంది అధికారులు వైరస్‌ను కట్టడి చేయడంలో చేస్తున్న ప్రయత్నం బ్రహ్మాండంగా ఉందని వ్యాధి కట్టడికి వారు తీసుకుంటున్న చర్యలు మంచి ఫలితాలు వస్తున్నాయని, తద్వారా వ్యాధి అంతగా వ్యాప్తి చెందడం లేదని తెలిపారు.

జిల్లాలో నమోదైన అరవై ఒక్క పాజిటివ్‌ కేసులో 30 మంది డిశ్చార్జి అయి బయటకు వచ్చారని ఇది ఒక మంచి పరిణామమని పేర్కొన్నారు. అయితే ప్రజలు మరికొన్ని రోజులు ఇదే స్ఫూర్తితో అధికారుల‌కు సహకారం అందిస్తే కట్టడికి అవసరమైన జాగ్రత్తలు పాటిస్తే తప్పకుండా మనం విజయాన్ని సాధిస్తామని, నాకా నమ్మకం ఉందని జిల్లా కలెక్టర్‌ నారాయణరెడ్డి, సిపి కార్తికేయ సూచనల‌ను అధికారులు సిబ్బంది ప్రజలు పాటిస్తే తప్పకుండా దీనిని దూరంగా ఉండగలుగుతారు.

జిల్లా ప్రజల‌కు గుడ్డతో తయారు చేసిన మాస్కులు పంపిణీ చేయడానికి మహిళా సంఘాల‌ ద్వారా దాతల‌ సహకారంతో సిద్ధం చేయించాల‌ని కలెక్టర్‌కు సూచించారు. సమావేశంలో జిల్లా పరిషత్‌ చైర్మన్‌ విట్టల్‌ రావు, నగర మేయర్‌ నీతూ కిరణ్‌, కమిషనర్‌ జితేష్‌ వి పాటిల్‌, అదనపు కలెక్టర్‌లు చంద్రశేఖర్‌, ల‌త, ఆర్‌డిఓ వెంకటయ్య, జిల్లా వ్యవసాయ అధికారి గోవిందు, డీఎస్‌ఓ వెంకటేశ్వరరావు, డిసిఓ సింహాచలం, ఏసిపి శ్రీనివాస్‌ కుమార్‌, అడిషనల్‌ సిపి రఘువీర్‌, జిల్లా మార్కెటింగ్‌ అధికారి తదితరులు పాల్గొన్నారు.

Check Also

నగరంలో మన్యం వీరుడి జయంతి

నిజామాబాద్‌, జూలై 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 123వ జయంతిని నిజామాబాద్‌ ...

Comment on the article