Breaking News

కామారెడ్డిలో లాక్‌డౌన్‌ పకడ్బందీగా అమల‌వుతోంది

కామారెడ్డి, ఏప్రిల్‌ 24

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మాస్కు ప్రతి ఒక్కరూ విధిగా ధరించాల‌ని రాష్ట్ర రోడ్లు భవనాల‌ శాఖ మంత్రి వేముల‌ ప్రశాంత్‌ రెడ్డి అన్నారు. శుక్రవారం కామారెడ్డి కలెక్టర్‌ చాంబర్‌లో అధికారుల‌తో దాన్యం కొనుగోలు, కరోనా వైరస్‌ నియంత్రణపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మాంసం విక్రయించేవారు, కొనుగోలు దారులు గ్లౌజులు, మాస్కు ధరించాల‌ని సూచించారు. కామారెడ్డి జిల్లాలో లాక్‌ డౌన్ అమలు పకడ్బందీగా జరుగుతోందని చెప్పారు.

ఉదయం 6 గంటల‌ నుంచి 11 వరకు మార్కెట్‌లో కూరగాయల‌ విక్రయాలు చేపడుతున్నారని తెలిపారు. మధ్యాహ్నం రెండు గంటల‌కు కిరాణా దుకాణాలు, సాయంత్రం 6 గంటల‌కు మెడికల్‌ దుకాణాలు మూసి వేస్తున్నారని చెప్పారు. జిల్లాలో కందులు, శనగ కొనుగోళ్లు పూర్తయిందని చెప్పారు. దాన్యం కొనుగోలు ముమ్మరంగా కొనసాగుతున్నాయని తెలిపారు. రైతులు కొనుగోలు కేంద్రాల్లో దాన్యం విక్రయించి గిట్టుబాటు ధర పొందాల‌ని పేర్కొన్నారు.

కరోనా నియంత్రణకు జిల్లా యంత్రాంగం తీసుకుంటున్న చర్యల‌ను జిల్లా కలెక్టర్‌ శరత్‌ను అడిగి తెలుసుకున్నారు. కొనుగోలు కేంద్రాల‌ వద్ద రైతుల‌కు ఇబ్బందులు కల‌గకుండా చూడాల‌ని కోరారు. సమావేశంలో ఎస్పీ శ్వేత, అదనపు కలెక్టర్‌లు యాదిరెడ్డి, వెంకటేష్‌ దోతురే, అసిస్టెంట్‌ కలెక్టర్‌ తేజస్‌ నందలాల్‌ పవర్‌, జిల్లా వైద్యాధికారి చంద్రశేఖర్‌ పాల్గొన్నారు.

Check Also

మొక్కల‌ సంరక్షణ బాధ్యత గ్రామ పంచాయతీల‌దే

కామారెడ్డి, జూలై 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జాతీయ రహదారిపై కిలోమీటర్‌కు 1 వేయి 266 మొక్కలు ...

Comment on the article