Breaking News

400 మంది ఆటో కార్మికుల‌కు నిత్యవసర సరుకుల‌ పంపిణీ

నాగిరెడ్డిపేట్‌, ఏప్రిల్‌ 28

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కరోనా మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలో లాక్‌ డౌన్ వ‌ల్ల నెల‌ రోజులుగా ఆటోలు నడవలేక జీవనోపాధి లేక ఇబ్బంది పడుతున్నారు. కాగా ఆటోలు నడిపే నిరుపేదల‌కు మంగళవారం ఎల్లారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే జాజాల‌ సురేందర్‌ ఆధ్వర్యంలో ఎంపీ బి.బి పాటిల్‌ నాగిరెడ్డిపేట్‌ మండలానికి చెందిన ఆటో నడిపే 400 మంది కార్మికుల‌కు చేయూతనందించారు.

ఒక్కో కార్మికునికి నిత్యావసర వస్తువుల‌తో పాటు రూ.500 లు పంపిణి చేసారు. కార్యక్రమంలో మార్కేట్‌ కమిటీ మాజీ ఛైర్మన్‌ ప్రతాప్‌ రెడ్డి, పి.ఏ.సి.యస్‌ ఛైర్మన్లు, నర్సింలు, గంగారెడ్డి, డైరెక్టర్లు శ్రీనివాస్‌ రెడ్డి, కపిల్‌ రెడ్డి, సాయి కుమార్‌, గాంధారి పార్టీ ప్రెసిడెంట్‌ సత్యం రావు, మున్సిపల్‌ ఛైర్మెన్‌ కుడుముల‌ సత్యం, మాజి జడ్పీటీసీ తానాజీ రావు, బోయిని విట్టల్‌, శ్రీనివాస్‌ రెడ్డి, నారాయణ, స్థానిక ఎంపీటీసీలు, సర్పంచులు పాల్గొన్నారు.

Check Also

సర్వే ద్వారా భూముల ‌పరిష్కారం

కామారెడ్డి, ఏప్రిల్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జాయింట్‌ సర్వే ద్వారా రెవెన్యూ, అటవీ భూముల‌ సమస్యల‌ ...

Comment on the article