Breaking News

పోరాటాల‌ ద్వారానే హక్కులు సాధ్యం

రెంజల్‌, మే 1

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : హక్కుల‌ను సాధించాలంటే పోరాటాల‌ ద్వారానే సాధ్యం అవుతాయని చికాగో కార్మికులు నిరూపించారని, కార్మిక అమరుల‌ స్ఫూర్తితో పోరాడి ఎన్నో చట్టాల‌ను సాధించుకున్నామని సీపీఐఎంఎల్‌ న్యూడెమోక్రసీ జిల్లా నాయకులు పార్వతి రాజేశ్వర్‌, పెద్దులు అన్నారు. మండలంలోని తాడ్‌ బిలోలి గ్రామంలో శుక్రవారం ప్రపంచ కార్మికుల‌ దినం మేడే పురస్కరించుకుని కార్మికుల‌ జెండా ఎగురవేశారు.

అనంతరం వారు మాట్లాడుతూ ఇప్పటికైనా సమసమాజం ఏర్పడాలంటే సోషలిస్టు వ్యవస్థ మార్గమని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక హక్కుల‌ను కాల‌రాస్తూ ఉపాధి భద్రత లేకుండా చేస్తున్నారని, ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగ కార్మికుల‌కు సుప్రీంకోర్టు 2016 అక్టోబర్‌ 26 తీర్పు ప్రకారం సమానపనికి సమాన వేతనం అమలు చేయాల‌ని అన్నారు. కార్యక్రమంలో నాయకులు ఒడ్డెన్న, నసీర్‌, నాగన్న, సాయిు తదితరులు పాల్గొన్నారు.

Check Also

శివాల‌యాల‌ వద్ద అన్నదానం

రెంజల్‌, ఫిబ్రవరి 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని పలు గ్రామాల్లో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని స్థానిక ...

Comment on the article