Breaking News

అంబలి కేంద్రం ప్రారంభం

ఎల్లారెడ్డి, మే 1

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎల్లారెడ్డి పట్టణంలో ప్రతి వేసవి కాలంలో ఏర్పాటు చేసే అంబలి కేంద్రాన్ని శుక్రవారం ప్రారంభించారు. గత 16 సంవత్సరాలుగా ప్రతీ వేసవి కాలంలో ఇక్కడ అంబలి కేంద్రం ఏర్పాటు చేస్తున్నట్టు నిర్వాహకులు తెలిపారు.

ఈ సందర్భంగా మున్సిపల్‌ చైర్మన్‌ కుడుముల‌ సత్యం మాట్లాడుతూ పేద ప్రజల‌ సేద తీర్చేందుకు ప్రతీ సంవత్సరం అంబలి కేంద్రం ఏర్పాటు చేస్తామన్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌ కౌన్సిల‌ర్లు జంగం నీకంఠం, బుంగారి రాము, ఎరుక సాయిు, పార్టీ నాయకులు రాజు, ఇమ్రాన్‌, ఎంపీటీసీ సంతోష్‌, పిఏసిఎస్‌ చైర్మన్‌ ఎగుల‌ నర్సింలు, సతీష్‌ తదితరులు పాల్గొన్నారు.

Check Also

మునిసిపల్‌ సమస్యలు పరిష్కరించాల‌ని ఆర్‌డివోకు వినతి

ఎల్లారెడ్డి, మే 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి అసిస్టెంట్‌ కలెక్టర్‌ ఎల్లారెడ్డి ఇంచార్జి ఆర్‌డివో వెంకటేష్‌ ...

Comment on the article