Breaking News

జివో 3 పునరుద్దరించాలి

కామారెడ్డి, మే 7

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సుప్రీంకోర్టు గతనెల‌లో ఆదివాసులు, గిరిజన ప్రజల‌ హక్కులు కాల‌ రాస్తూ రద్దుచేసిన జీవో నంబరు 3 ను పునరుద్దరించి ఎస్‌టి హక్కులు కాపాడాల‌ని కోరుతూ ఎంసిపిఐయు పార్టీ ఆధ్వర్యంలో గురువారం కామారెడ్డి ఆర్డివో కార్యాల‌యం ముందు నిరసన తెలిపి ఏవోకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా కార్యదర్శి రాజలింగం మాట్లాడుతూ సుప్రీంకోర్టు రాజ్యాంగం ప్రసాదించిన హక్కు విషయంలో జోక్యం చేసుకోవడం ఏమిటని ప్రశ్నించారు.

రాజ్యాంగ విరుద్ద నిర్ణయంపై సుప్రీంకోర్టు పున సమీక్షించి గిరిజనహక్కులు కాపాడాల‌ని అన్నారు. జీవో పునరుద్ధరణకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణం కోర్టులో రివ్యూ పిటిషన్‌ వేసి గిరిజనుల‌ పట్ల చిత్తశుద్ధి నిరూపించుకోవాల‌ని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యులు జబ్బర్‌ నాయక్‌, సిద్దరాములు, స్వామి, శ్రీను తదితరులు పాల్గొన్నారు.

Check Also

రైతులు లాభసాటి పంట వైపు మొగ్గు చూపాలి

కామారెడ్డి, మే 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి కలెక్టరేట్‌లో కోవిడ్‌-19, ధాన్యం సేకరణ, సమగ్ర వ్యవసాయ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *