Breaking News

Daily Archives: May 8, 2020

పేదల‌ ఆకలి తీరుస్తున్న డీసీసీ అధ్యక్షులు

కామారెడ్డి, మే 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గడచిన 39 రోజులుగా కామారెడ్డి డిసిసి అధ్యక్షుడు కైలాస్‌ శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో శీనన్న యువసైన్యం ప్రతినిధులు అన్నదానం చేస్తున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి ముందు, నిరుపేద గ్రామాల‌నుండి వచ్చే రోగుల‌కు, కరోనా వ‌ల్ల‌ పనులు లేక ఇబ్బంది పడుతున్న దిక్కుతోచని వల‌స కార్మికుల‌కు, భవన నిర్మాణ కార్మికుల‌కు ఆహార పదార్థాలు అందజేశారు. లాక్‌ డౌన్‌ ఉన్నన్ని రోజులు సేవ చేయడం జరుగుతుందని డిసిసి అధ్యక్షుడు కైలాస్‌ శ్రీనివాస్‌ అన్నారు. ...

Read More »

కామారెడ్డికి 713 మంది ఇతరులు

కామారెడ్డి, మే 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 437 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ శరత్‌ అన్నారు. శుక్రవారం కామారెడ్డి కలెక్టరేట్‌ జనహితలో విలేకరుల‌తో మాట్లాడారు. రైతులు పండిరచిన ప్రతి ధాన్యం గింజను కొనుగోలు చేస్తామని, వడగండ్ల వానతో నష్టపోయిన రైతుల‌ వివరాలు వ్యవసాయ శాఖ అధికారులు సేకరిస్తున్నారని పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాల‌ నుంచి మన జిల్లాకు 713 మంది వ్యక్తులు వచ్చారని వారిని ఇరవై ఎనిమిది రోజుల‌పాటు గృహనిర్బంధంలో ఉంచుతామని చెప్పారు. వారికి కమ్యూనిటీ, ...

Read More »

చిన్నారుల‌కు వ్యాధి నిరోధక టీకాలు తప్పకుండా వేయాలి

కామారెడ్డి, మే 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వాసుపత్రిలో ప్రసవాలు జరిగే విధంగా చూడాల‌ని కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ శరత్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్‌ జనహితలో శుక్రవారం వైద్యాధికారులు, ఐసిడిఎస్‌ అధికారుల‌తో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రతి గురువారం, శనివారం అంగన్వాడి డే ను గ్రామాల్లో నిర్వహించాల‌ని, ఆరోగ్య కార్యకర్త, ఆశా కార్యకర్తలు విధిగా హాజరు కావాల‌ని కోరారు. గర్భవతుల‌ నమోదు రెండు శాఖల‌ అధికారులు సమన్వయం చేసుకొని 100 శాతం నమోదు చేయాల‌ని, ఇంతవరకు రెండు ...

Read More »

చేపల‌వేటకెళ్ళి యువకుని మృతి

కామారెడ్డి, మే 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనె 6వతేదీ సరంపల్లి గ్రామానికి చెందిన కంది శివకుమార్‌ చేపల‌ కోసం సరంపల్లి చెరువుకు వెళ్ళి ప్రమాదవశాత్తు మృత్యువాత పడ్డాడు. శుక్రవారం ఉదయం చెరువులో శవమై తేలాడు. మృతుని తండ్రి విఠల్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచార‌ణ జరుపుతున్నారు. మృతునికి ఇంకా వివాహం కాలేదు.

Read More »

మద్యపానం నిషేదించాలి

కామారెడ్డి, మే 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మద్యపానం నిషేధించాల‌ని ఏఐవైఎఫ్‌, ఏఐఎస్‌ఎఫ్‌ ఆధ్వర్యంలో ఒక్కరోజు నిరాహారదీక్ష నిర్వహించారు. దీక్షకు సీపీఐ కామారెడ్డి జిల్లా కార్యదర్శి ఎల్‌.దశరథ్‌ సంఫీుభావం తెలిపారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఇంతటి విపత్కర పరిస్థితుల్లో మద్యపానం నిషేధించాల‌ని ఏఐవైఎఫ్‌, ఏఐఎస్‌ఎఫ్‌ ఆధ్వర్యంలో ఒక్కరోజు నిరాహారదీక్ష చేశారు. దీక్షకు సీపీఐ కామారెడ్డి జిల్లా కమిటీ సంఫీుభావం తెలిపారు. ఈ సందర్భంగా సీపీఐ జిల్లా కార్యదర్శి, ఎల్‌.దశరథ్‌, ఎస్‌ఆర్‌ శేఖర్‌, రాజిరెడ్డి మాట్లాడుతూ గ్రీన్‌ జోన్‌, తదితర ప్రాంతాల్లో ...

Read More »

ఖరీఫ్‌కు ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉంచాలి

నిజామాబాద్‌, మే 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైతుకు ఖరీఫ్‌ సీజన్‌కు అవసరమైన ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉంచాల‌ని నిజామాబాద్‌ జిల్లా కలెక్టర్‌ సి నారాయణ రెడ్డి అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లో సంబంధిత అధికారుల‌తో జిల్లాలో విత్తనాలు, ఎరువుల నిలువ‌లు తదితర అంశాల‌పై సమీక్షించారు. ఖరీఫ్‌ సీజన్‌లో రైతుకు ఎరువులు, విత్తనాల‌ కొరత లేకుండా చూడాల‌ని, ఏ మేరకు అవసరమవుతాయో గుర్తించి కొరత లేకుండా చూడాల‌ని కలెక్టర్‌ అధికారుల‌ను ఆదేశించారు. ఎరువులు దింపుకోడానికి గోదాముల‌ కొరత లేకుండా చూడాల‌ని, సొసైటీలో నిలువ‌లు ...

Read More »

కందులు, శనగల‌ డబ్బు వెంటనే విడుదల‌ చేయాలి

కామారెడ్డి, మే 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లాలో ప్రభుత్వ కొనుగోలు కేద్రాల్లో కొనుగోలు చేసిన కందులు, శనగల‌కు సంబంధించిన డబ్బులు ఇప్పటికి రైతుల‌కు అంద లేదని వాటిని వెంటనే విడుదల‌ చేయాల‌ని భారతీయ జనతా పార్టీ కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు బాణాల ల‌క్మారెడ్డి అన్నారు. ఈ మేరకు పార్టీ రాష్ట్ర శాఖ పిలుపుమేరకు రైతు సమస్యల‌పై శుక్రవారం జిల్లా కలెక్టర్‌కు వినతి పత్రం అందజేయాల‌నుకున్నారు. కలెక్టర్‌ అందుబాటులో లేకపోవడంతో ఏవోకు సమర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ వరి కొనుగోలు ...

Read More »

బాధిత కుటుంబానికి సరుకులు పంపిణీ చేసిన ఎంపిటిసి

నందిపేట్‌, మే 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా నందిపేట మండలం తొండాకుర్‌ గ్రామంలో ఐకెపి వారి ఆధ్వర్యంలో ఇటీవల ఇల్లు కాలి పోయిన మహిళల‌కు నెల‌రోజుల‌కు సరిపడా నిత్యవసర సరుకులు, మాస్కులు అందజేశారు. స్థానిక మూడు గ్రామాల‌ ఎంపీటీసీ సభ్యురాలు మద్దుల‌ రాణి మురళి, సర్పంచ్‌ దేవన చేతుల‌ మీదుగా సరుకులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్‌ రాజేందర్‌, జిల్లా విద్య క్రీడల‌ కార్యదర్శి మద్దుల‌ మురళి, ఐకెపి విఓఎ రాధిక, అశోక్‌, మహిళలు పాల్గొన్నారు.

Read More »

సిఎం చిత్రపటానికి పాలాభిషేకం

నిజాంసాగర్‌, మే 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్‌ రైతుల‌కు 25 వేల‌ రూపాయల‌ లోపు అప్పు ఉన్నవారికి ఒకేసారి రుణమాఫీ డబ్బును విడుదల‌ చేసిన సందర్భంగా ఆత్మ కమిటీ చైర్మన్‌ రాంసింగ్‌, కల్హేర్‌ జడ్పీటీసీ నర్సిహ్మారెడ్డి ఆధ్వ‌ర్య‌లో ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్‌ రెడ్డి ఆదేశాల‌మేరకు కెసిఆర్‌ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. రైతు కళ్ళలో ఆనందం చూస్తే కడుపునిండినట్టు ఉందని వారన్నారు. కార్యక్రమంలో జెడ్పీ కొఆప్షన్‌ సభ్యులు అలీ, వైస్‌ ఎంపిపి నారాయణ రెడ్డి, మండల‌ కోఆప్షన్‌ ఘనీ, ...

Read More »

ఘనంగా రెడ్‌క్రాస్‌ దినోత్సవం

నిజామాబాద్‌, మే 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఇండియన్‌ రెడ్‌ క్రాస్‌ సొసైటీ నిజామాబాదు జిల్లా శాఖలో ప్రపంచ రెడ్‌ క్రాస్‌ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిధిగా నిజామాబాదు జడ్పి చైర్మన్‌ దాడన్నగారి విట్టల్‌ రావు హాజరై హేన్రి డునంట్‌ చిత్రపటానికి పూల‌మాల‌ వేసి రెడ్‌ క్రాస్ సేవ‌లు కొనియాడారు. అనంతరం రెడ్‌ క్రాస్‌ చైర్మన్‌ డాక్టర్‌ నీలి రాంచందర్‌ మాట్లాడుతూ నేషనల్‌ హెడ్‌ క్వార్టర్స్ ఢిల్లీి వారు ఇచ్చిన ఆదేశాల‌ మేరకు రెడ్‌ క్రాస్ వాలంటీర్లకు, కోవిడ్‌-19 ...

Read More »